Newsమ‌హేష్ గోల్డెన్ హ్యాండ్ పడిన మీనాక్షికి బంప‌ర్ ఆఫ‌ర్... ఆ స్టార్...

మ‌హేష్ గోల్డెన్ హ్యాండ్ పడిన మీనాక్షికి బంప‌ర్ ఆఫ‌ర్… ఆ స్టార్ హీరో ఒళ్లో ప‌డింది..!

మీనాక్షి చౌదరి చాలా చిన్న చిన్న సినిమాలతో చిన్నగా కెరీర్ ప్రారంభించింది. ఇంకా చెప్పాలంటే మొదటి రెండు సినిమాలు పెద్ద డిజాస్టర్లు.. అయినా నిరాశ చెందలేదు. తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే వస్తుంది. హిట్ 2 సినిమాతో సక్సెస్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్‌ను ఒక్కసారిగా ఆకర్షించింది. ఏకంగా మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ అందుకుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి మహేష్ కి జోడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా నుంచి పూజా హెగ్డే త‌ప్పుకోవ‌డంతో మీనాక్షి చౌద‌రికి అదృష్టం వ‌రించింది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మరో బంపర్ ఆఫర్ అందుకుంది. మహేష్ బాబు గోల్డెన్ హ్యాండ్ ఎప్పుడైతే పడిందో ఈ అమ్మడికి మరింత లక్‌ కలిసి వచ్చినట్లయితే హాలీవుడ్ స్టార్ హీరో విజయ్ స‌ర‌సన నటించే అవకాశం కొట్టేసింది. మీనాక్షి వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమాలో మీనాక్షి హీరోయిన్గా తీసుకున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు కూడా..!

రష్మిక లాంటి హీరోయిన్ కు కూడా తానెంటో ప్రూవ్ చేసుకున్నకే అవకాశాలు ఇచ్చాడు విజయ్. అలాంటిది మీనాక్షి చౌదరికి మాత్రం వెంటనే ఛాన్స్ దొరికేసింది. ఈ బ్యూటీకి ఇది చాలా పెద్ద ఆఫర్ అనుకోవాలి. విజయ్ సరస‌న‌ నటిస్తే కోలీవుడ్లో క్రేజీ మామూలుగా ఉండదు. మరి ఇటు తెలుగులో మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో పాటు అటు విస్వ‌క్సేన్ – వరుణ్ తేజ్ సినిమాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు విజయ్ సినిమాతో ఆమె సౌత్ ఇండియాలోనే తిరుగు లేని స్టార్ హీరోయిన్ అయిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news