Newsఎన్టీఆర్ సినిమాలో న‌టించి త‌ప్పు చేశాను... హీరో వేణు సంచ‌ల‌నం...!

ఎన్టీఆర్ సినిమాలో న‌టించి త‌ప్పు చేశాను… హీరో వేణు సంచ‌ల‌నం…!

తొట్టింపూడి వేణు టాలీవుడ్ లో రెండు దశాబ్దాల క్రితం క్రేజీ హీరోగా ఒక వెలుగు వెలిగాడు. కే విజయభాస్కర్ దర్శకత్వంలో వచ్చిన స్వ‌యంవ‌రం సినిమాతో హీరో అయిన వేణు తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమాలో వేణుకు జోడిగా విజయవాడ అమ్మాయి లయ హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత వేణు చిరునవ్వుతో – ఖుషీ ఖుషీగా – పెళ్ళాం ఊరెళితే లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

అప్పట్లో వేణు స్టైల్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు మహేష్ బాబు, ఎన్టీఆర్, బన్నీ శకం మొదలవడంతో వేణు ఫెడౌట్ అయ్యాడు. ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దమ్ము సినిమాలో ఎన్టీఆర్‌కు బావమరిది పాత్రలో నటించాడు. మళ్ళీ లాంగ్ గ్యాప్ తీసుకొని గత ఏడాది వచ్చిన రవితేజ రామారావు ఆన్‌ డ్యూటీ సినిమా కూడా చేశాడు.

అయితే ఈ రెండు సినిమాలు వేణుకు సక్సెస్ ఇవ్వలేదు. ముఖ్యంగా దమ్ము సినిమా గురించి వేణు ఇన్ని రోజులకు చేసిన వ్యాఖ్యలు హాట్‌ టాపిక్ గా మారాయి. తాను సినిమాలకు చాలా కాలం గ్యాప్ ఇచ్చి దమ్ము సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చానని తెలిపాడు. ఇందులో పాత్ర కోసం బోయపాటి వేణుని సంప్రదించగా ఓకే చెప్పారట.

షోలే సినిమాలో అమితాబ్ లాంటి పాత్ర అని చెప్పడంతో పాటు.. సినిమాలో చిన్న క్యారెక్టర్ కావడంతో తన పాత్ర ఎలా ఉంటుంది కథ ఏమిటి ? అని అస్సలు అడగలేదట. అయితే దమ్ము సినిమా స్టోరీ ముందే తెలిసి ఉంటే కచ్చితంగా ఒప్పుకునే వాడిని కాదని వేణు సంచలన వ్యాఖ్యలు చేశాడు. చేసిన కొద్ది సినిమాలైనా ప్రేక్షకులను ఆకట్టుకునే ఉండాలన్నదే తన సిద్ధాంతం అని వేణు చెప్పాడు. వేణు చెప్పిన మాటలను బట్టి దమ్ము సినిమాలో వేణు పాత్ర మనోడికి ఏమాత్రం నచ్చలేదని క్లియర్ గా తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news