Moviesప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించి పెద్ద త‌ప్పు చేశా... ఆ హీరోయిన్ బాధ...

ప్ర‌భాస్ ప‌క్క‌న న‌టించి పెద్ద త‌ప్పు చేశా… ఆ హీరోయిన్ బాధ వెన‌క ఇంత క‌థ ఉందా ?

పాన్ ఇండియన్ హీరో అయినా ప్రభాస్ పక్కన నటించి ఉండాల్సింది కాదేమో అంటూ బాలీవుడ్ హాట్ బ్యూటీ తన సన్నిహితుల వద్ద చెప్పి వాపోయినట్టు హిందీ సీమలో టాక్ వినిపిస్తోంది. ఆ హాట్ బ్యూటీ మరెవరో కాదు శ్రద్ధ కపూర్. ఆషికీ 2 సినిమాతో బాలీవుడ్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న శ్రద్ధ అనూహ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ నటించిన మరో పాన్ ఇండియన్ సినిమా సాహో.

బాకాఫీస్ వద్ద ఈ సినిమా ఘోర పరాజయ్యాన్ని మూటగట్టుంది. బాహుబలి రెండు భాగాలలో ప్రభాస్ ఎంత హ్యాండ్సం గా కనిపిస్తాడో సాహో సినిమాలో దానికి పూర్తి భిన్నంగా కనిపిస్తాడు. లుక్ దగ్గర్నుంచే ఈ సినిమాకి నెగిటివిటీ ఎక్కువైపోయింది. మరీ ముఖ్యంగా కథ, కథనం సాహో ఫ్లాప్ కి కారణం అయితే హీరోయిన్‌గా నటించిన శ్రద్ద కపూర్ మరో కారణం అయింది. అసలు శ్రద్దాని ఈ సినిమా కోసం ఎందుకు ఎంచుకున్నారో అర్థం కాలేదు.

సౌత్ లో ఫ్లాపైనా బాలీవుడ్ లో మాత్రం ఈ సినిమా 150 కోట్లు వసూలు చేసి అక్కడ ప్రభాస్ మార్క్ ని ఇంకాస్త పెంచింది. ఈ సినిమాకి కాస్త ఊరట అంటే ఇదొక్కటే. భారీగా రెమ్యునరేషన్ ఇచ్చిన శ్రద్ద కపూర్, జాక్వెలిన్ ఫెర్నాండస్ పెద్ద మైనస్ అయ్యారు. దర్శకుడు సుజీత్ మేకింగ్ గురించి మాత్రం అటు బాలీవుడ్ లో ఇటు సౌత్ లో గొప్పగా మాట్లాడుకున్నారు. ఈ సినిమా ఎఫెక్ట్ వల్ల చిరంజీవితో వచ్చిన ఛాన్స్ కూడా సుజీత్ కి మిస్సైంది. మళ్ళీ ఇంత కాలానికి పవన్ కళ్యాణ్ తో సినిమా చేసే ఛాన్స్ అందుకున్నాడు.

అయితే, ఎప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీపైన ఆశలు పెట్టుకునే బాలీవుడ్ హీరోయిన్స్ ఇక్కడ మంచి లాంఛింగ్ కోసం ఎదురు చూస్తుంటారు. అలా ఎదురు చూసిన శ్రద్ధకి వచ్చింది మంచి ఛాన్స్ అయినా అది డిజాస్టర్ కావడంతో చాలా డిసప్పాయింట్ అయింది. ప్రభాస్ కాకుండా మరో యంగ్ హీరో సినిమాతో ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంటే టాలీవుడ్ లో తన కెరీర్ బావుండేదేమో అని నీరుకారిపోతుందట. చూడాలి మరి మనవాళ్ళు శ్రద్ధపైన మరోసారి కన్నేస్తారేమో.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news