Newsనాన్న చేసిన ప‌నితోనే ప్రియుడితో ప్రేమ‌లో ప‌డ్డ ఐశ్వ‌ర్య‌... ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ..!

నాన్న చేసిన ప‌నితోనే ప్రియుడితో ప్రేమ‌లో ప‌డ్డ ఐశ్వ‌ర్య‌… ఇంట్ర‌స్టింగ్ ల‌వ్‌స్టోరీ..!

సీనియర్ నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. తాజాగా నిన్న ఐశ్వర్య ఎంగేజ్మెంట్ పూర్తయింది. తమిళ సీనియర్ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి, ఐశ్వర్య కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే వీరి ప్రేమకు రెండువైపులా కుటుంబ సభ్యులు ఓకే చెప్పటంతో ఎంగేజ్మెంట్ సింపుల్గా ముగించేశారు. చెన్నైలో అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ టెంపుల్ లో ఈ ఎంగేజ్మెంట్ జరిగింది.

వచ్చే నెలలోనే వీరి పెళ్లి ఉంటుందని తెలుస్తోంది. ఐశ్వర్య – ఉమాపతి పెళ్లి థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్‌లో చేయాలని అనుకుంటున్నారట. ఇక ఉమాపతి – ఐశ్వర్య ప్రేమ చాలా విచిత్రంగా చిగురించింది. తమిళంలో ఐశ్వర్య తండ్రి అర్జున్ హోస్ట్ చేసిన ఓ కార్యక్రమంలో ఉమాపతి పాల్గొన్నారు. అదే కార్యక్రమంలో ఐశ్వర్య కూడా పనులు చక్కబెట్టేది. ఈ క్రమంలోనే ఐశ్వర్య – ఉమాపతి మధ్య ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మరి ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు.

తన చిన్న కొడుకు ఉమాపతి.. ఐశ్వర్యను ప్రేమించిన విషయం చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని తనకు చాలా సంతోషంగా ఉందంటున్నారు తంబి రామయ్య. ఇక తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకొని కోలీవుడ్‌లో హీరోయిన్గా అడుగుపెట్టింది ఐశ్వర్య. విశాల్ పక్కన ఒక సినిమాలో నటించింది కూడా కానీ ఆమెకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. అయితే ఇప్పుడు పెళ్లితో లైఫ్‌లో సెటిల్ అవ్వాలని నిర్ణయం తీసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాలలో నటిస్తుందా లేదా అన్నది తర్వాత తేలిపోనుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news