Newsబాబాయ్ బాల‌య్య‌కు జోడీగా అబ్బాయ్ ఎన్టీఆర్ హీరోయిన్‌..!

బాబాయ్ బాల‌య్య‌కు జోడీగా అబ్బాయ్ ఎన్టీఆర్ హీరోయిన్‌..!

నందమూరి బాలకృష్ణ తాజాగా భగవంత్‌ కేసరి సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య కెరీర్లో 109వ సినిమా తెరకెక్కుతోంది. బాబి దర్శకత్వంలో తెర‌కెక్కే ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. బాలయ్య సినిమా అనగానే ప్లాష్‌బ్యాక్‌ కచ్చితంగా ఉంటుంది. ఈ సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్యకి జోడిగా నటించే హీరోయిన్‌ను ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది.

సీనియర్ హీరోయిన్ త్రిష ఈ ఫ్లాష్ బ్యాక్ లో బాలయ్యకి హీరోయిన్గా నటిస్తుంద‌ట‌. అందంతో మాత్రమే కాదు.. నటనకు ఉన్న పాత్ర కావడంతో దర్శకుడు బాబి త్రిష‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ పాత్ర చుట్టూ ఈ యాక్షన్ మోడ్‌ కూడా ఉంటుందని టాక్. బాలయ్యకు తొలిసారిగా జోడీగా త్రిష ఈ సినిమాలో నటిస్తోంది. గతంలో అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్‌కు జోడిగా దమ్ము సినిమాలో నటించిన త్రిష కెరీర్లో తొలిసారిగా బాబాయ్ బాలయ్యతో జోడి కడుతుంది.

ఇది బాలయ్య టైపు ఫక్ యాక్షన్ డ్రామా కాదని.. ఇది ఒక ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో సాగే ఎమోషనల్ సినిమా అని తెలుస్తోంది. అలాగే పాలిటిక్స్ నేపథ్యంలో కూడా ఓ ప్లాష్ బ్యాక్ ఉంటుందట. ఏది ఏమైనా ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బాలయ్య తనకు కలిసి వచ్చినట్టుగా ఈ సినిమాలో కూడా డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news