Newsమ‌హేష్ అక్క మంజుల - బాల‌కృష్ణ కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా...

మ‌హేష్ అక్క మంజుల – బాల‌కృష్ణ కాంబినేష‌న్లో మిస్ అయిన సినిమా తెలుసా..!

తెలుగు సినీ ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ పేరు అంటేనే ఎంతో సుపరిచితం. కృష్ణ తర్వాత ఆయన కుమారుడు మహేష్ బాబు సినిమాల్లోకి వచ్చి ఈరోజు టాలీవుడ్ లో తిరుగులేని సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. విచిత్రం ఏంటంటే కృష్ణ కుమార్తె మంజుల‌ కూడా టాలీవుడ్ లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. కృష్ణ కుమార్తె మంజుల తన సోదరుడు మహేష్ బాబు హీరోగా నాని – పోకిరి సినిమాలు నిర్మించారు.

అలాగే షో సినిమాలో కూడా ఆమె నటించారు. అయితే ఇదంతా మంజులకు పెళ్లయ్యాక జరిగిన విషయాలు. మంజుల పెళ్లి కాకముందు నందమూరి నట‌సింహం బాలకృష్ణకు జోడిగా ఒక సినిమాలో హీరోయిన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. ఆ సినిమా ఏదో కాదు ఎస్ వి.కృష్ణారెడ్డి దర్శకత్వంలో బాలయ్య నటించిన టాప్ హీరో. ఈ సినిమాలో హీరోయిన్ గా మంజులను ఎంపిక చేశారు.

అయితే కృష్ణ అభిమానులు మంజుల హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వడం ఇష్టం లేదు. అందులోనూ నందమూరి – ఘట్టమనేని అభిమానుల మధ్య అప్పట్లో తమ హీరోలే గొప్ప అన్న యుద్ధం బాగా నడిచేది. అలాంటిది బాలకృష్ణకు జోడిగా కృష్ణ కుమార్తె హీరోయిన్గా చేయటం ఏంటని ? కృష్ణ గారి దగ్గరికి వెళ్లి మీ నిర్ణయాన్ని మార్చుకోమని బలవంతంగా ఒత్తిడి చేశారు.

అభిమానులు తనపై గట్టిగా ఒత్తిడి తేవడంతో కృష్ణ గారికి కూడా మంజులను హీరోయిన్ చేయటం ఇష్టం లేదు. అలా మంజుల సినిమా ఎంట్రీ అప్పట్లో ఆగిపోయింది. అయితే ఆ తర్వాత చాలా రోజులకు ఆమె వెండి తెరపై కనిపించాలన్న కోరికతో షో సినిమా చేసి తన కోరిక తీర్చుకుంది. అయితే ఆ సినిమా అంతగా సక్సెస్ కాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news