Newsఎన్టీఆర్ కొత్త సినిమా: అర్జ‌నుడు - కృష్ణుడు శ‌త్రువులు అయితే...!

ఎన్టీఆర్ కొత్త సినిమా: అర్జ‌నుడు – కృష్ణుడు శ‌త్రువులు అయితే…!

మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్ సినిమాల‌లో వార్ 2 ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ – బాలీవుడ్ క్రేజీ హీరో హృతిక్ రోషన్ కలయికలో రాబోతున్న ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా ? అని చాలామంది సినీ అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు.

ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందా? ఆ సినిమా కంటే ముందు వార్‌ 2 సినిమా ఉంటుందా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. వార్ 2 సినిమాకు ఎన్టీఆర్ తక్కువ రోజులు కాల్ సీట్లు ఇస్తే ఈ సినిమాయే ముందుగా పట్టాలెక్కుతుందని కూడా తెలుస్తోంది. ఇక వార్ 2 కథ విషయానికి వస్తే హృతిక్ రోషన్ పాత్రకు ధీటుగా ఎన్టీఆర్ పాత్ర ఉంటుందట.

ఇది ఇద్దరి స్నేహితుల కథ అని.. మహాభారతంలో అర్జునుడు – కృష్ణుడులా కలిసి ఉన్న ఇద్దరు ప్రాణ స్నేహితులు చివరకు శత్రువులుగా మారితే ఎలా ? ఉంటుంది అన్న కోణంలో ఈ సినిమా కథ సాగుతుందట. ఏది ఏమైనా వార్ 2 అనేది అదిరిపోయే యాక్షన్ ఫిలిం. ఇక ఎన్టీఆర్ యాక్షన్ కథలో నటిస్తే ఎలా దుమ్మురేపుతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఎన్టీఆర్ వార్ 2 సినిమాతో తన నట విశ్వరూపాన్ని నేషనల్ లెవెల్ లో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news