Newsమంచు విష్ణుకు షాక్ ఇచ్చిన హీరోయిన్‌...!

మంచు విష్ణుకు షాక్ ఇచ్చిన హీరోయిన్‌…!

టాలీవుడ్ యువ‌నటుడు మంచి విష్ణు హీరోగా మహాభారతం సిరీస్ తెరకెక్కించిన ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా భ‌క్త‌కన్నప్ప. ఇది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్. 24 ప్రేమ్స్ ఫ్యాక్టరీ – ఏ వి ఏ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ ప్రాజెక్టు గ్రాండ్ లాంచింగ్ ఇటీవల జరిగింది. ఈ సినిమా లాంచ్ ఈవెంట్లో కృతి సనన్‌ సోదరి నుపూర్ సనన్‌ కూడా పాల్గొన్నారు.

ఈ సినిమాలో నుపూర్ సనన్‌ హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే. మణిశర్మ – స్టీఫెన్ దేవదాసి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు పరిచరి గోపాలకృష్ణ – తోట ప్రసాద్ – సాయి మాధవ్ బుర్ర ముగ్గురు కలిసి సంయుక్తంగా కథను అందిస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే హీరోయిన్ నుపూర్ మంచు విష్ణుకు షాక్ ఇచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా ఎంపికైన ఆమె డేట్లు సర్దుబాటు కానీ కారణంగా ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు స్పష్టం చేసింది.

ఈ విషయాన్ని మంచి విష్ణు స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. ఈ సినిమా నుంచి నుపూర్‌ తప్పుకుందని… ఆమె రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ లు సొంతం చేసుకోవాలని ఆమె స్థానంలో మరో హీరోయిన్ త్వరలో తీసుకుంటామని చెప్పాడు. ఇక ఈ సినిమా షూటింగ్ బాగా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉండడంతో నుపూర్‌ తప్పుకున్నట్టు తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news