Newsగోపీచంద్ పెద్ద ఉపాధిహామీ ప‌థ‌కం హీరో...!

గోపీచంద్ పెద్ద ఉపాధిహామీ ప‌థ‌కం హీరో…!

టాలీవుడ్ లో హీరో గోపీచంద్ వరుస పరాజ‌యాలతో విలవిలాడుతున్న పరిస్థితి. టాలీవుడ్ లో డిజాస్టర్ లతో విలవిలలాడుతున్న డైరెక్టర్లకు గోపీచంద్ పిలిచి మరి అవకాశాలు ఇస్తున్నాడు. మీ దగ్గర కథ ఉంటే చాలు కాల్షీట్లు ఇవ్వడానికి నేను రెడీ అంటున్నాడు గోపీచంద్. వరుస‌ పెట్టి ఫ్లాప్ డైరెక్టర్లకు అవకాశాలు ఇస్తున్నాడు ఈ ఆరడుగుల అజనుబాహుడు.

ఇప్పటికి శ్రీను వైట్లకు ఛాన్స్ ఇచ్చాడు. శ్రీనువైట్ల హిట్ సినిమా హిట్‌ కొట్టి ఏళ్లు దాటింది. శ్రీనుకు ఛాన్స్ కష్టంగా మారిన సమయంలో గోపీచంద్ ఓకే చెప్పాడు. శ్రీను వైట్ల తర్వాత ప్రభాస్‌తో రాధేశ్యామ్‌ తీసిన డిజాస్టర్ డైరెక్టర్ రాధాకృష్ణకు ఛాన్స్ ఇస్తున్నాడు. గతంలో రాధాకృష్ణ – గోపీచంద్ కాంబినేషన్లో జిల్ సినిమా తెరకెక్కింది.

వీళ్లిద్దరూ మాత్రమే కాదు.. వరుస ప్లాపులతో ఉన్న మారుతికి పక్కా కమర్షియల్ ఛాన్స్ ఇస్తే పెద్ద డిజాస్టర్ ఇచ్చాడు. ఇక అవకాశాలు లేని శ్రీవాస్ కు సాక్ష్యం తర్వాత ఛాన్స్ ఇస్తే రామబాణం రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు. మరి గోపీచంద్ ఉపాధి హామీ పథకంతో వ‌రుస‌ అవకాశాలు ఇస్తున్న ఈ డిజాస్టర్ డైరెక్టర్లు అతడి కెరీర్‌ మరింత పాతాళంలో పడేస్తారా లేదా హిట్ ఇస్తారా అన్నది చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news