Newsత్రివిక్ర‌మ్‌ను సైడ్ చేసేసిన బ‌న్నీ... ' గుంటూరు కారం ' హిట్...

త్రివిక్ర‌మ్‌ను సైడ్ చేసేసిన బ‌న్నీ… ‘ గుంటూరు కారం ‘ హిట్ అయితే చూద్దాం…!

ఏ రంగంలో అయినా సక్సెస్ ఉన్నచోట విలువ ఉంటుంది.. ఎవరైనా సక్సెస్‌కు దూరంగా ఉంటే వాళ్లను ఎంత క్లోజ్ అయినా కూడా దూరం పెట్టేస్తూ ఉంటారు. ఎంత గొప్ప వాళ్లకు అయినా ఈ పరిస్థితి కామన్ గా వస్తూ ఉంటుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పరిస్థితి కూడా ఇప్పుడు పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మిన చందంగా కనిపిస్తోంది. అల వైకుంఠపురంలో సినిమా తర్వాత త్రివిక్రమ్ ఇప్పటివరకు సినిమా చేయలేదు. ఇప్పటికే చాలా గ్యాప్ వచ్చేసింది.

త్రివిక్రమ్ ఫామ్ లో ఉన్నాడా లేదా అన్నదానిపై చాలావరకు క్లారిటీ లేదు. పైగా మహేష్ బాబుతో చేస్తున్న గుంటూరు కారం సినిమా చాలా ఆలస్యంగా నడుస్తోంది. ఈ సినిమా అవుట్ ఫుట్ విషయంలో మహేష్ బాబు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది. అందుకే త్రివిక్రమ్‌తో సినిమాలు చేసే విషయంలో చాలామంది స్టార్ హీరోలు కూడా గుంటూరు కారం రిలీజ్ అయ్యాక రిజల్ట్ చూశాక.. అవకాశం ఇద్దాం అన్న ఆలోచనలో ఉన్నారు.

ఎవరో ఎందుకు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏకంగా మూడు సినిమాలలో నటించిన‌ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఇప్పుడు అదే ఆలోచన చేస్తున్నాడు. ఒకప్పటి బన్నీ వేరు ఇప్పుడు బన్నీ క్రేజ్ వేరు, పుష్ప సినిమాతో బన్నీ ఏకంగా పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉంది. త్రివిక్రమ్ కథలు అన్ని కేవలం తెలుగు ఆడియెన్స్‌ను టార్గెట్ చేసినట్టుగా ఉంటాయి. అందుకే త్రివిక్రమ్ తో సినిమా అంటే కాస్త వెనక ముందు ఆలోచిస్తున్న పరిస్థితి.

గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి సక్సెస్ అయితే అప్పుడు చాన్స్ ఇద్దాం అన్నట్టుగా ఉన్నాడు. అందుకే ఇప్పుడు బన్నీతో త్రివిక్రమ్ చేయాల్సిన సినిమా ఇప్పట్లో ఉండదని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత బన్నీ కోలీవుడ్‌ దర్శకుడు అట్లీతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని ముంబైలో అట్లీ- బన్నీ మధ్య చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news