Movies"అట్లీ అమ్మాయిలతో అలానే బీహేవ్ చేస్తాడు".. సెన్సేషనల్ మ్యాటర్ ని బయటపెట్టిన...

“అట్లీ అమ్మాయిలతో అలానే బీహేవ్ చేస్తాడు”.. సెన్సేషనల్ మ్యాటర్ ని బయటపెట్టిన సిరి..!!

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తాజాగా నటించిన సినిమా జవాన్ . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. మొదటి హీరోయిన్గా నయనతార రెండవ హీరోయిన్గా దీపికా పదుకొనే నటించారు . ఇద్దరు కూడా తన నటనతో సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చి సక్సెస్ అందుకున్నారు . దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసే1000 కోట్లకు దూసుకెళ్తున్న ఈ సినిమాలో మన తెలుగు అమ్మాయి కూడా నటించడం గర్వకారణం అని చెప్పాలి .

సోషల్ మీడియా స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న సిరి.. ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ లో నటించింది . రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సిరి జవాన్ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విషయాల పై ఓపెన్ అప్ అయింది . “ఇలాంటి క్రమంలోనే షారుక్ ఖాన్ తో సినిమా ఆఫర్ వచ్చిందంటే ముందు తను నమ్మలేకపోయాను అని.. కాల్ రాగానే ఎవరో ఫేక్ కాల్ అంటూ నన్ను ఏడిపిస్తున్నారని భావించానని తర్వాత మా మేనేజర్ కూడా అదే కన్ఫామ్ చేయడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని చెప్పుకొచ్చింది “.

అంతేకాదు ముంబైకి ఒక్కదాన్నే వెళ్లాలంటే భయం వేసి శ్రీహాన్ ని తీసుకెళ్లానని చెప్పుకొచ్చింది . అంతేకాదు డైరెక్టర్ నేను కూడా హిందీ అమ్మాయిని అనుకోని ఓ డైలాగ్ సరిగ్గా చెప్పనప్పుడు నా మీద కోప్పడ్డారని ..అరిచేసారని నేను ఏడ్చేసానని.. ఆ టైంలో షారుఖ్ ఖాన్ నా దగ్గరకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావ్ అంటూ.. మోటివేట్ చేశారని ..అలాంటి సీన్ నా లైఫ్ లో వస్తుంది అని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదని.. అసలు షారుక్ ఖాన్ తో సినిమా నటించడమే గొప్ప అనుకుంటే.. ఆయన నా దగ్గరికి వచ్చి నన్ను మోటివేట్ చేయడం నా లైఫ్ లో మర్చిపోలేని చెప్పుకొచ్చింది . మొత్తానికి అట్లీ సీన్ బాగా రాకపోతే అరుస్తాడు అన్న మేటర్ ని చెప్పకనే చెప్పేసింది సిరి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news