Moviesమెగా ఇంట పెళ్లి భాజ షురూ.. వరుణ్-లావణ్యల నుండి గుడ్ న్యూస్...

మెగా ఇంట పెళ్లి భాజ షురూ.. వరుణ్-లావణ్యల నుండి గుడ్ న్యూస్ వచ్చేసిందోచ్..పెళ్లి ఎప్పుడంటే..!!

కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా..? అంటూ ఆశగా వెయిట్ చేసిన అప్డేట్ త్వరలోనే రాబోతుంది . మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పెళ్ళికొడుకు కాబోతున్నాడు. దీనికి సంబంధించిన పెళ్లి షాపింగ్ కూడా మొదలైపోయింది . ఈ క్రమంలోనే రీసెంట్గా షాపింగ్ కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మనకు తెలిసిందే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ప్రేమించుకున్నారు .

ఈ విషయం ఇన్నాళ్లు బయట చెప్పకపోయినా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఫైనల్లీ నిశ్చితార్థంతో ఒక్కటైయ్యారు ఈ జంట . అఫీషియల్ గా తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధం వరకు తీసుకెళ్లింది . జూన్ 9వ తేదీ నాగబాబు నివాసంలో నిశ్చితార్థం చాలా గ్రాండ్ గా జరిగింది . నవంబర్ ఒకటవ తేదీ వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇటలీలో వీళ్ళ పెళ్లి జరగబోతున్నట్లు తెలుస్తుంది . రీసెంట్ గానే వీళ్ళ పెళ్లికి సంబంధించిన షాపింగ్ పనులను స్టార్ట్ చేశారు లావణ్య త్రిపాఠి – వరుణ్ తేజ్ . కాగా రీసెంట్గా వీళ్ళిద్దరూ పెళ్లికి షాపింగ్ చేస్తున్న దృశ్యాలు వీడియో నెట్టింట వైరల్ గా మారింది . వరుణ్ తేజ్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తే లావణ్య త్రిపాఠి చాలా ట్రెండీగా అల్ట్రా లుక్ లో అదరగొట్టేసింది . దీనితో సోషల్ మీడియాలో వీళ్ళకి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది . త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు ఈ జంట అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news