తెలుగు ప్రేక్షకులకు జగతి మేడం సుపరిచితం. ప్రస్తుతం బుల్లితెరపై నెంబర్ వన్ సీరియల్ గా దూసుకుపోతున్న గుప్పెడంత మనసు సినిమాతో ఆమె తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. జగతి అలియాస్ జ్యోతి రాయ్. ఈ సీరియల్లో రిషి తల్లిగా జగతి మేడం తన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకుంది. సాంప్రదాయ కట్టు బొట్టుతో సహజనటనతో మెప్పిస్తుంది. అయితే బుల్లితెరపై ఎంతో సంప్రదాయ లుక్‌లో కనిపించే జ్యోతి రాయ్ గత కొద్ది నెలలుగా సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు ఏ స్థాయిలో హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయో చెప్పక్కర్లేదు.
టీవీలో జనాలు చూసే జగతి మేడం వేరు.. సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ వేరు. కొంతకాలంగా నెట్టింట్లో చిట్టిపొట్టి డ్రెస్సులు.. హాట్ హాట్ డ్రస్సులతో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నానా రచ్చ రచ్చ చేస్తుంది. జ్యోతి రాయ్ ఇటు బుల్లితెరతో పాటు అటు ఓటిటిలో హీరోయిన్గా స్పందడి చేస్తుంది. తాజాగా ఆమె ది ప్రీట్టి గర్ల్ అనే వెబ్ సీరిస్ ద్వారా సినీప్రియులను అలరించేందుకు రెడీ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ నుంచి రీసెంట్గా రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ నెట్టింట్లో తెగ వైరల్ అయింది.
అసలు జ్యోతిరాయ్ తాజా హాట్ పిక్‌లు చూస్తుంటే రచ్చ మామూలుగా లేదు. ఆమె బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లను మించి మరి హాట్ గా కనిపించేందుకు తాపత్రయపడుతోంది. ఇప్పటికే ఆమె వయసు 40 + దాటాయి. పెళ్లయి ఓ బాబు కూడా ఉన్నాడు. అయితే భర్తకు విడాకులు ఇచ్చేసిన ఆమె ఓ కన్నడ యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో ఉందని టాక్ నడిచింది. సదరు యంగ్ డైరెక్టర్ జ్యోతిరాయ్ కంటే వయసులో చాలా చిన్నోడు.
కొద్ది రోజుల క్రితం జ్యోతి అతడితో చాలా క్లోజ్ గా తీసుకున్న సెల్ఫీలు కూడా షేర్ చేసింది. అయితే ఇప్పటి వరకు వీరిద్దరి మధ్య ప్రేమ ఉందంటూ వస్తున్న వార్తలుకు ఆమె పుల్ స్టాప్ పెట్టేసింది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం నిజమైన తేల్చేసింది. యంగ్ డైరెక్టర్ సుకు పూర్వాజ్‌తో ఎంగేజ్మెంట్ జరిగిందంటూ అఫీషియల్ గా చెప్పేసింది. పూర్వాజ్‌తో కలిసి ఉన్న ఫోటోలు ఇన్స్టాల్ లో షేర్ చేస్తూ క్యాప్షన్ లో ఉంగరం గుర్తుతో పాటు ప్రేమ చిహ్నాలు ఎమోజీలను పెట్టింది.
దీనితో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగినట్టుగా కన్ఫామ్ అయింది. త్వరలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే బాలీవుడ్ ప్రేమ పక్షులు ముదుర ముద్దుగుమ్మ మలైకా అరోరా, యంగ్ హీరో అర్జున్ కపూర్ ప్రేమాయణం దేశవ్యాప్తంగా ఎంత వైరల్ అవుతుందో.. ఇప్పుడు ఈ ముదురు ఆంటీ జ్యోతిరాయ్ – కుర్ర డైరెక్టర్ సుకు పూర్వాజ్ ప్రేమ పెళ్లి కూడా సౌత్ మీడియాలో అంతే హైలెట్‌గా మారింది.