Moviesఅనసూయతో గొడవ..విజయ్ గూబ గుయ్యమనే ఆన్సర్.. తప్పు ఎవరిదో ఓపెన్ గానే...

అనసూయతో గొడవ..విజయ్ గూబ గుయ్యమనే ఆన్సర్.. తప్పు ఎవరిదో ఓపెన్ గానే చెప్పేసాడుగా..!!

టాలీవుడ్ రౌడీ హీరోగా పాపులారిటీ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ తాజాగా నటించిన సినిమా ఖుషి . శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై హ్యూజ్ ఉఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తుంది . మరి ముఖ్యంగా ఈ సినిమా కి సంబంధించిన షూట్ మొత్తం కంప్లీట్ అయింది . సెప్టెంబర్ 1 గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది .ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ను రిలీజ్ చేశారు మేకర్స్ .

అయితే ఈ ట్రైలర్లు ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండకు అనసూయతో గొడవపై ప్రశ్న ఎదురైంది . ఓ మీడియా రిపోర్టర్ అనసూయతో గొడవ వివాదంపై మీ స్పందన ఏంటి అసలు ఈ గొడవ ఎలా స్టార్ట్ అయింది అంటూ బోల్డ్ గా అడిగాడు. అయితే విజయ్ దేవరకొండ అంతకంటే బోల్డ్ గానే ఆన్సర్ ఇచ్చారు. “అసలు గొడవ ఏంటో నాకు తెలియదు ..? సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియదు ..? గొడవ పెట్టుకునే వాళ్ళని అడిగితేనే మీకు ఆన్సర్ వస్తుంది..? ” అంటూ చాలా ఘాటుగా దిమ్మ తిరిగిపోయే రేంజ్ లో బదులిచ్చాడు .

సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. అంతేకాదు విజయ మాటలు బట్టి ఆయన తప్పు ఏమీలేదని.. ఎదుటివారే గిల్లి గిచ్చుకుంటున్నారని ఫ్యాన్స్ చెబుతున్నారు . అంతేకాదు ఈ యొక్క దెబ్బతో అనసూయ విజయ్ దేవరకొండ వివాదంలో తప్పు అనసూయ అంటూ క్లారిటీ వచ్చేసింది అని ఫ్యాన్స్ ఆయన మాటలను బట్టి అర్థం చేసుకుంటున్నారు .మొత్తానికి ఖుషి సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో విజయ్ దేవరకొండ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి అనసూయ పేరును సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేస్తుంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news