Moviesవ‌రుణ్‌తేజ్ కూడా నిండా ముంచేస్తున్నాడా… ఇలా అయితే కెరీర్ ఎలా ?

వ‌రుణ్‌తేజ్ కూడా నిండా ముంచేస్తున్నాడా… ఇలా అయితే కెరీర్ ఎలా ?

టాలీవుడ్‌లో మెగా హీరోల‌తో సినిమాలు అంటే రెమ్యున‌రేష‌న్లు, బడ్జెట్ విష‌యంలో నిర్మాత‌ల‌ను కాస్త ఇబ్బంది పెడుతుంటార‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఎప్ప‌టి నుంచో ఉన్నాయి. ఒక్క హిట్ పడితే చాలు ఆ సినిమా క‌లెక్ష‌న్లు చూపించి త‌ర్వాత సినిమాల‌కు విప‌రీతంగా రెమ్యున‌రేషన్లు పెంచేస్తార‌న్న‌దే ఈ కంప్లైంట్‌. వాల్తేరు వీర‌య్య హిట్ అవ్వ‌గానే చిరు భోళాశంక‌ర్ సినిమాకు ఏకంగా రు. 15 కోట్ల రెమ్యున‌రేష‌న్ పెంచేశారు.

దీనికి తోడు అద‌నంగా మ‌రో రు. 5 కోట్లు ఖ‌ర్చులు అయ్యాయి. చివ‌ర‌కు సినిమా ప్లాప్ అవ్వ‌డంతో ఎంత రు 10 కోట్ల చెక్కు వెన‌క్కు ఇచ్చినా కూడా రు. 55 కోట్ల రెమ్యున‌రేష‌న్ అంటే చాలా ఎక్కువ‌. చిరు క‌నీసం స‌గానికి సగం వెన‌క్కు ఇచ్చినా నిర్మాత అనిల్ సుంక‌ర‌కు భారీ న‌ష్టాలు త‌ప్ప‌వు. ఇక ప‌వ‌న్ క‌ళ్యాణ్ రోజు రెమ్యున‌రేష‌న్ రోజుకు రు. 2 కోట్ల రేంజ్‌లో ఉంటుంద‌ని ఆయ‌నే చెప్పుకుంటున్నారు.

బ్రో సినిమా నిర్మాత‌కు కూడా భారీ న‌ష్టాలు త‌ప్ప‌లేదు. చివ‌ర‌కు ప్రమోష‌న్లు కూడా ప‌వ‌న్ ప‌ట్టించుకోలేదు. ఇక ఇప్పుడు వ‌రుణ్‌తేజ్ కూడా ఒక్కో సినిమాకు రు. 15 కోట్ల రేంజ్‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటోన్న ప‌రిస్థితి. ఆయ‌న లేటెస్ట్ సినిమా గాండీవధారి అర్జునకు ఏకంగా రు. 55 కోట్ల మేరకు ఖర్చయినట్లు తెలుస్తోంది.

పైగా డైరెక్ట‌ర్ ప్ర‌వీణ్ స‌త్తార్‌కు అంత ట్రాక్ లేదు. వ‌రుణ్ తేజ్ కూడా ప్లాపుల్లో ఉన్నాడు. అయినా ఇంత బ‌డ్జెట్ ఎందుకు ? అయ్యింది అంటే కేవ‌లం హీరో రెమ్యున‌రేష‌న్‌కే రు. 15 కోట్లు పోతే ఇక మిగిలిన కాస్టింగ్‌, మేకింగ్‌కు అంత ఖ‌ర్చ‌వ్వ‌డంలో ఆశ్చ‌ర్యం అక్క‌ర్లేదు. ఈ సినిమాకు నాన్ థియేట‌ర్ 26 కోట్ల వరకు రాగా.. థియేట‌ర్ నుంచి రు. 30 కోట్లు రావ‌డం అంటే చాలా క‌ష్టం అని ట్రేడ్ చెపుతోంది.

ఎంత హిట్ టాక్ వ‌చ్చినా కూడా రు. 30 కోట్ల షేర్ అంటే వ‌రుణ్ – ప్ర‌వీణ్ స‌త్తార్ కాంబినేష‌న్లో పెద్ద మ్యాజిక్ జ‌ర‌గాలంటున్నారు. ఏదేమైనా వ‌రుణ్ లాంటి హీరోలు ప్లాపుల్లో ఉన్న‌ప్పుడు అయినా క‌నీసం త‌మ రెమ్యున‌రేష‌న్ కంట్రోల్ చేసుకోక‌పోతే నిర్మాత‌కు మిగిలే ఆ రూపాయి కూడా ఏం ఉండ‌ద‌నే ఇండ‌స్ట్రీ గ‌గ్గోలు పెడుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news