Moviesచరణ్-తారక్ ల కంటే ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఇతనే..ఎంత...

చరణ్-తారక్ ల కంటే ఇండస్ట్రీలో హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరో ఇతనే..ఎంత స్పెషల్ అంటే..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ప్రెసెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలు ఒక్కొక్కరు 50 కోట్లు 60 కోట్లు 70 కోట్లు కొంతమంది హీరోలు ఏకంగా 100 కోట్లు పారితోషకం తీసుకుంటున్నారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే టాప్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ , ప్రభాస్ , అల్లు అర్జున్ లాంటి హీరోలు ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల పారితోషకం అందుకొని తెలుగు బాక్సాఫీస్ స్టామినా ఏంటో ప్రూవ్ చేస్తున్నారు .

అయితే ఇలాంటి క్రమంలోనే ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన తెలుగు హీరో పేరు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది . ఆయన మరెవరో కాదు విజయ్ దేవరకొండ . సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మనకు తెలిసిందే. ఇండస్ట్రీకి వచ్చిన 5 ఏళ్లలోనే ఇంత పాపులారిటీ దక్కించుకున్నాడు విజయ్ దేవరకొండ . బాలీవుడ్ బ్యూటీస్ అయితే విజయ్ దేవరకొండ పేరు చెప్తే పడి చచ్చిపోతూ ఉంటారు. అంతటి హాట్ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.

అయితే ప్రెసెంట్ విజయ్ దేవరకొండ నటించిన ఖుషి సినిమాకు గాను ఆయన ఏకంగా 45 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది. ఇది నిజంగా రాంచరణ్-తారక్ తో కంపేర్ చేస్తే ఎక్కువనే చెప్పాలి . అయితే ఇప్పుడు కాదు ఒకప్పుడు ..అనగా నాలుగేళ్ల ముందు వరకు కూడా చరణ్ తారక్ రెమ్యూనరేషన్ చాలా తక్కువ. ఇప్పుడు తీసుకున్నంత అందుకునే వాళ్ళు కాదు .అయితే విజయ్ దేవరకొండ మాత్రం తన కెరీర్ లో తక్కువ హిట్స్ కొట్టి ఇంతటి రేంజ్ రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.

చరణ్-తారక్ కెరియర్ లో ఎన్నో హిట్లు కొట్టి మరి ఈ స్థాయికి వచ్చారు . కానీ విజయ్ దేవరకొండ కేవలం మూడు అంటే మూడు హీట్లను తన ఖాతాలో వేసుకొని ఈ స్థాయికి ఎదిగిపోయాడు. ఒకవేళ అర్జున్ రెడ్డి తర్వాత సరైన సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ పడి ఉంటే విజయ్ దేవరకొండ కూడా గ్లోబల్ స్థాయిలో పాపులారిటీ దక్కించుకున్నాడు. ఆయన నటించిన లైగర్ సినిమా ఎంత చెత్త టాక్ సంపాదించుకుందో తెలిసిందే. అయినా కూడా ఖుషి సినిమాకు 45 కోట్ల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసి తీసుకున్నాడు.. అంటే జనాల్లో ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి చూడాలి విజయ్ దేవరకొండ జాతకం ఎలా మారబోతుందో ..సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యే ఖుషి సినిమా పైన ఆధారపడి ఉంది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news