Newsప‌వ‌న్ నీకు ఎన్టీఆర్‌తో పోటీప‌డేంత‌ సాహ‌సం వ‌ద్దంటోన్న శ్రీ రెడ్డి...!

ప‌వ‌న్ నీకు ఎన్టీఆర్‌తో పోటీప‌డేంత‌ సాహ‌సం వ‌ద్దంటోన్న శ్రీ రెడ్డి…!

టాలీవుడ్ హాట్ బ్యూటీ శ్రీ రెడ్డి ఇటీవల వరుసగా కాంట్రవర్సీ కామెంట్లతో రెచ్చిపోతుంది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గానూ.. హాట్ హాట్ గాను ఉండే శ్రీ రెడ్డి ఎక్కువగా మెగా ఫ్యామిలీని టార్గెట్గా చేస్తూ పోస్టులు పెడుతూ దుమారం రేపుతూ ఉంటుంది. శ్రీరెడ్డి పెట్టే పోస్టులకు మెగా అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తున్నా శ్రీరెడ్డి మాత్రం ఎప్పుడు ఎక్కడ వెనక్కు తగ్గకుండా కామెంట్లు చేస్తూ ఉంటుంది.

తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్రో సినిమా రిలీజ్ అయ్యి నెగటివ్ టాక్ వచ్చినప్పుడు శ్రీరెడ్డి ఆ సినిమాను టార్గెట్ చేస్తూ కామెంట్లు చేసింది. ఈ క్రమంలోనే మరోసారి పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

ఇక పవన్ కళ్యాణ్ హీరోగా సాహో దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజి సినిమా కూడా సమ్మర్ లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ముందుగా ఈ సినిమాను క్రిస్మస్ బరిలో నిలపాలని అనుకున్నారు. అయితే షూటింగ్ లేట్ కావడంతో ఈ సినిమాను కూడా ఏప్రిల్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాల పోటీపై శ్రీ రెడ్డి తాజా కామెంట్లు చేసింది.

రెండు వారాల గ్యాప్ లోనే మొదట తమ్ముడు సినిమా.. తర్వాత అన్న సినిమా.. దొందు సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఎలాంటి పోటీ లేకుండా ఉంటేనే ఇలా ప్లాప్ అయ్యాయి అంటే.. ఇంకా ఏప్రిల్ లో ఎన్టీఆర్ దేవరతో పోటీ పడటం అంటే సాహసం అని చెప్పాలి అంటూ చెప్పుకొచ్చింది. శ్రీరెడ్డి చేసిన కామెంట్లో ఓజీకి దేవరతో పోటీపడే సాహసం వద్దు అని పవన్ కు ఇండైరెక్ట్ గా చెప్పకనే చెప్పినట్లు అయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news