Newsక‌ళ్యాణ్‌రామ్‌, బాల‌య్య‌ను కాద‌నుకున్నాడు... ఇప్పుడు పెద్ద గొయ్యిలో ప‌డ్డాడు...!

క‌ళ్యాణ్‌రామ్‌, బాల‌య్య‌ను కాద‌నుకున్నాడు… ఇప్పుడు పెద్ద గొయ్యిలో ప‌డ్డాడు…!

టాలీవుడ్ లో చాలామంది కెరీర్ ప్రారంభంలో ఒకే ఒక ఛాన్స్ కోసం ఎంతకు అయినా కిందకు దిగజారుతూ ఉంటారు. చివరికి కాళ్ళ.. వేళ్ల‌పడి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తొలి సినిమాతో హిట్టు వస్తే ఆ సినిమా ఛాన్స్ ఇచ్చిన వారిని తర్వాత గుర్తు పెట్టుకోరు. హిట్ వచ్చాక అదంతా తమ గొప్పతనంగా తమ ఖాతాలో వేసుకుంటూ తమ క్రేజ్ పెంచుకునేందుకు పాకులాడుతూ ఉంటారు. ఉదాహరణకి నందమూరి కళ్యాణ్ రామ్ అతనొక్కడే సినిమాతో సురేందర్ రెడ్డి కి దర్శ‌కుడిగా ఛాన్స్ ఇచ్చారు.

ఆ తర్వాత సురేందర్ రెడ్డి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. డిజాస్టర్ సినిమాలు కూడా తీశారు. అదే కళ్యాణ్‌రామ్ తో హీరోగా మరో సినిమా తీయలేదు. నా రేంజ్ పెరిగిపోయింది… క‌ళ్యాణ్‌రామ్ చిన్న హీరో అన్న భావ‌న‌కు వ‌చ్చేశాడు సురేంద‌ర్‌. చివరకు కళ్యాణ్ రామ్ నిర్మాతగా ర‌వితేజ హీరోగా కిక్ 2 సినిమా నిర్మిస్తే పరమ ఘోరమైన డిజాస్టర్ సినిమా తీసి కళ్యాణ్ రామ్‌కు భారీ నష్టాలు మిగిల్చి పెట్టాడు. సురేందర్ రెడ్డికి అసలు కృతజ్ఞత ఉందో లేదో అతడి మనస్సాక్షికే తెలియాలి.

అదే కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో అనిల్ రావిపూడికి దర్శకుడుగా ఛాన్స్ ఇచ్చారు. అసలు అనిల్ రావిపూడి అపజయం అన్నదే లేకుండా వరుసగా 6 సూపర్ డూపర్ హిట్లు కొట్టారు. కళ్యాణ్ రామ్ తో మరో సినిమా తీసి తాను ఆయన రుణం తీర్చుకుంటానని చెబుతున్నారు. ఇది ఎప్పటికీ జరుగుతుందో చూడాలి. ఇక బింబిసార సినిమాతో మల్లిడి వశిష్ఠ్‌కు దర్శకుడుగా ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమా మంచి హిట్ అయింది. బింబిసారకు సీక్వెల్ ఉంటుందని కూడా ప్రకటించారు. పైగా ఈ సినిమా చూసిన బాలయ్య వశిష్టను మెచ్చుకుంటూ కలిసి చేద్దాం నేను కూడా నీకు అవకాశం ఇస్తున్నా అని బంపర్ ఆఫర్ ఇచ్చారు.

కానీ వశిష్ తనకు డైరెక్టర్గా ఛాన్స్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ తో సినిమా చేయకుండా అటు మెగాస్టార్ నుంచి ఆఫర్ రావడంతో ఇటు బాలయ్య ఇచ్చిన అవకాశం కూడా వద్దనుకుంటూ చిరంజీవి వెనకాల పడ్డాడు. ఇటు బింబిసార సీక్వెల్ పై వర్క్ చేయలేదు. అందుకే కళ్యాణ్ రామ్ బింబిసార సీక్వెల్ ఉంటుందని ప్రకటించినా ఆ సినిమా వేరే డైరెక్టర్ తో తీయటానికి సిద్ధమైపోయాడు. అయితే ఇప్పుడు భోళాశంకర్ డిజాస్టర్ అవడంతో చిరంజీవి తన తర్వాత సినిమాల విషయంలో ఆచితూచి జాగ్రత్తలు వేస్తున్నాడు.

ఈ క్రమంలోనే కురసాల కళ్యాణకృష్ణ సినిమాను సైతం చేయాలా వద్దా ? అన్న త‌ర్జ‌న‌ భర్జనలు జరుగుతున్నాయి. యూవీ క్రియేషన్స్ బ్యానర్లో బింబిసారా దర్శకుడు వశిష్ఠ్‌ దర్శకత్వం వహించే సినిమా కూడా అసలు ఉంటుందా ఉండదా ? అన్నది తెలియటం లేదు. పైగా ఈ కథని చిరంజీవి మరోసారి సమీక్షించబోతున్నట్టు తెలుస్తోంది. ఏమాత్రం ఇబ్బంది అనిపించినా చిరు ఈ సినిమాని పక్కన పెట్టేస్తారని కూడా సమాచారం. ఏది ఏమైనా తనకు అవకాశాలు ఇచ్చిన కళ్యాణ్ రామ్.. బాలయ్యను కాదని చిరంజీవి వెనకాల పడ్డ వశిష్ ఇప్పుడు గోతిలో పడినట్టే కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news