Moviesఎన్టీఆర్ ' దేవ‌ర‌ ' పై రూమ‌ర్లు… అవ‌న్నీ ఫేక్ అంటూ...

ఎన్టీఆర్ ‘ దేవ‌ర‌ ‘ పై రూమ‌ర్లు… అవ‌న్నీ ఫేక్ అంటూ కొట్టిప‌డేసిన టీం…!


టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ ముద్దుగుమ్మ‌ జాన్వి కపూర్ హీరోయిన్గా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ భారీ పాండ్ ఇండియా సినిమా దేవర. ఎన్టీఆర్‌కు త్రిబుల్ ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. దేవరలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తుండగా.. కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్‌ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు.

ఏకంగా రెండు పెద్ద బ్యానర్లు కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్.. కొరటాల సన్నిహితుడు మిక్కిలినేని సుధాకర్ తన యువ సుధా ఆర్ట్స్ పై అత్యంత ప్రతిష్టాత్మకంగా దేవరను నిర్మిస్తున్నారు. కేవలం నందమూరి అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ లోను ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇక అసలు విషయంలోకి వెళ్తే దేవర సినిమాను ప‌లు ఇండియా భాషలతో పాటు ఇంగ్లీష్ వర్షన్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో ఒకటే చర్చ జరుగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమా రిలీజ్ ప్లానింగ్ జరుగుతుందన్న గుసగుసలు అయితే బయటకు వచ్చాయి.

ఈ వార్త‌ల‌పై దేవర టీం స్పందించింది. అది నిజం కాదని అవన్నీ అవాస్తవాలు అంటూ కొట్టి పడేసింది. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నట్టు టాక్. దేవర సినిమాను ఇప్పటికే 2024 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news