టాలీవుడ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం బాలయ్యతో భగవంత్ కేసరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ క్రేజీ హీరోయిన్ శ్రీలీలా బాలయ్య కూతురు పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి టాలీవుడ్ ట్రేడ్ వర్గాలలో సెన్షేషన్ క్రియేట్ చేసింది. టీజర్, టైటిల్ పోస్టర్ల దెబ్బతో భగవంతు కేసరి ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా రు. 80 కోట్లు దాటేసింది.
బాలయ్య కెరీర్ లోనే ఇది ఆల్టైమ్ కేర్ రికార్డుగా నిలిచింది. ఇక భగవంత్ కేసరి సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్‌బ్యాక్ లీక్ అయింది. ఈ ఫ్లాష్ బ్యాక్ చాలా ఎంటర్టైన్ గా.. ఇంట్రెస్టింగా, యాక్షన్ ఎలిమెంట్స్ తో డిజైన్ చేశాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఫ్లాష్ బ్యాక్ చాలా పవర్ఫుల్ యాక్షన్ తో కొనసాగుతుందని అనిల్ రావిపూడి బాలయ్య మాస్, యాక్షన్ ఇమేజ్ బ్యాలెన్స్ చేస్తూ చాలా పవర్ ఫుల్ గా 40 నిమిషాల పాటు దీనిని డిజైన్ చేసినట్టు తెలుస్తోంది.
బాలయ్య అభిమానులకు థియేటర్లలో ఈ 40 నిమిషాల సినిమా చూస్తుంటే పూనకాలు రావటం ఖాయమన్నంత చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తోంది. ఇక శ్రీలీల – బాలయ్య కాంబినేషన్లో వచ్చే ఎమోషనల్ ట్రాక్ కూడా సినిమాకు హైలెట్ కాను ఉందని సమాచారం. బాలయ్యకి విలన్ పాత్ర కోసం బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌ను తీసుకున్నారు.
బాలయ్య – అర్జున్ రాంపాల్ మధ్య వచ్చే యాక్షన్ సీన్లు గూస్ బంప్ మోత మోగించేస్తాయని అంటున్నారు. ఏది ఏమైనా అనిల్ రావుపూడి తనదైన మార్క్ టైమింగ్ తో… బాలయ్య తనదైన మాస్ యాక్షన్ డైలాగులతో ఈ సినిమాను ఒక రేంజ్‌కు తీసుకు వెళ్లారని తెలుస్తోంది. దసరా కానుకగా అక్టోబర్ 19న భగవంత్ కేసరి థియేటర్లలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.