Moviesథియేట‌ర్లో ఆ సినిమా చూస్తూ లాస్య‌కు ప్ర‌పోజ్ చేసిన భ‌ర్త‌… రొమాంటిక్...

థియేట‌ర్లో ఆ సినిమా చూస్తూ లాస్య‌కు ప్ర‌పోజ్ చేసిన భ‌ర్త‌… రొమాంటిక్ వీడియో

ప్రముఖ యాంకర్ బిగ్‌బాస్ ఫేం లాస్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అప్పట్లో యాంకర్ గా ఆమె అచ్చ తెలుగుదనం ఉట్టిపడేలా తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు సొంతం చేసుకుంది. ముఖ్యంగా యాంకర్ రవి – లాస్య జోడి బుల్లితెరపై కనిపిస్తున్నారు అంటే చాలు బుల్లితెర షేక్ అయిపోయేది. వీరిద్దరూ కలిసి చేసిన ఎన్నో ప్రోగ్రామ్స్‌కు టిఆర్పి రేటింగులు రికార్డులు బ్రేక్ చేశాయి. ఆ తర్వాత లాస్య మంజునాథను ప్రేమ పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత లాస్య యాంకరింగ్ గుడ్ బై చెప్పేసి గృహణిగా ఇంటి వద్ద బాధ్యతలు చూసుకుంటుంది. ఇటీవల లాస్య దంపతులు రెండో బిడ్డకు జన్మనిచ్చారు. అలాగే లాస్య సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తుంది. ఇటీవల రెండో బిడ్డకు జన్మనిచ్చిన లాస్య సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటికప్పుడు తమ ఫ్యామిలీ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అలరిస్తూ వస్తోంది. తాజాగా లాస్య తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

తన భర్త మంజునాథ్‌తో కలిసి ఆమె థియేటర్లో హంగామా చేసింది. ఈ జంట అందరి ముందు థియేటర్లో రొమాంటిక్గా రెచ్చిపోయారు. భర్త మంజునాథ్ థియేటర్లోనే లాస్యకు మరోసారి ప్రపోజ్ చేస్తూ రచ్చ చేశారు. మంజునాథ్ లాస్య‌కు ప్రపోజ్ చేస్తుంటే థియేటర్లో సినిమా చూస్తున్న వాళ్లంతా ఈలలు.. కేకలతో హోరెత్తించారు.

సూర్య హీరోగా నటించిన సూర్య‌ సన్నాఫ్ కృష్ణ సినిమా రీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాల్లో సీన్‌ అనుకరిస్తూ లాస్య చేసిన హంగామా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ రొమాంటిక్ వీడియో పై మీరు కూడా ఒక లుక్ వేయండి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news