Moviesహీరోయిన్స్ పేరులో అది ఉంటే.. పట్టిందల్లా బంగారమే.. ఇంతకంటే ప్రూఫ్ కావాలా..!

హీరోయిన్స్ పేరులో అది ఉంటే.. పట్టిందల్లా బంగారమే.. ఇంతకంటే ప్రూఫ్ కావాలా..!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి చిన్న విషయాన్ని పెద్దదిగా చేసి చూస్తున్నారు జనాలు . అంతేకాదు కొన్ని విషయాలను ఇంట్రెస్టింగ్గా ట్రెండ్ చేస్తున్నారు . కాగ ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ న్యూస్ వైరల్ గా మారింది . సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్స్ ఎవరి పేరు అయితే “ఎస్” అనే అక్షరంతో స్టార్ట్ అవుతుందో వాళ్ళు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వస్తే వాళ్ల జాతకం మారిపోతుందని ..వాళ్ళు పట్టిందల్లా బంగారమే అయిపోతుందని ప్రచారం చేస్తున్నారు.

దానికి తగ్గట్టే కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు . సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న సావిత్రి పేరు “ఎస్” తో స్టార్ట్ అవుతుంది . ఈ క్రమంలోనే ఆమె ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్గా రాజ్యమేలేసింది అంటూ ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత ఆస్థానాన్ని దక్కించుకునింది అందాల నటి శ్రీదేవి. అతిలోకసుందరి శ్రీదేవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే . ఇండస్ట్రీలో చెరగని ముద్రను తన పేరుపై వేసుకునింది.

శ్రీదేవి పేరు కూడా “ఎస్” అనే అక్షరంతోనే స్టార్ట్ అవుతుంది. కాగా ఆ తర్వాత ఇండస్ట్రీలో కి వచ్చిన సౌందర్య కూడా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇప్పటికి మన మధ్య లేకపోయినా జనాలు ఆమెను ఎంతలా ఆరాధిస్తున్నారో మనం చూస్తూనే వచ్చాం . ఆ తర్వాత వచ్చిన సాయి పల్లవి, శృతిహాసన్, సమంత, శ్రీలీల లాంటి తదితర ప్రముఖులు కూడా “ఎస్” అనే లెటర్ వచ్చిన హీరోయిన్స్ ఇండస్ట్రీలో స్టార్స్ గా మారారు . ప్రజెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news