Moviesమలయాళ పిల్లకి చుక్కలు చూపిస్తున్న తెలుగు జనాలు.. ఇలా ఇరుకున్నేసావ్ ఏంటి...

మలయాళ పిల్లకి చుక్కలు చూపిస్తున్న తెలుగు జనాలు.. ఇలా ఇరుకున్నేసావ్ ఏంటి అనుపమా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అనుపమ పరమేశ్వరణ్ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా అ ఆ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ రాజ్యమేలేస్తుంది . రీసెంట్ గానే బ్యాక్ టు బ్యాక్ మూడు బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ..త్వరలోనే తెలుగు స్క్వేర్ సినిమాతో మరొక హిట్ ని తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధమవుతుంది.

రీసెంట్గా రిలీజ్ అయిన ప్రోమో ఈ సినిమాలో అనుపమ ఎంత హాటుగా కనిపించబోతుందో హింట్ కూడా ఇచ్చేసింది . రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనుపమకు తెలుగులో ఇష్టమైన హ్యాండ్ సమ్ హీరో ఎవరు అనే ప్రశ్న ఎదురైంది ..? ఈ క్రమంలోనే సెకండ్ కూడా ఆలోచించుకోకుండా ..టాలీవుడ్ ఇండస్ట్రీలో హ్యాండ్సమ్ అండ్ స్టార్ హీరో నాకు నచ్చిన హీరో ఎవరు అంటే అల్లు అర్జున్ అంటూ చెప్పుకొచ్చింది .

అయితే ఈ మాటలు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు నచ్చేసిన మిగతా ఫ్యాన్స్ కు ఇబ్బందికరంగా అనిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో అల్లు అర్జున్ ఒక్కడే హ్యాండ్సమ్ హీరోనా..? మిగతా హీరోలు పనికిరారా ..? అయినా నువ్వు ఇంతవరకు అల్లు అర్జున్ తో ఒక్క సినిమా కూడా చేయలేదు ..? మరి నీకు అయిన హ్యాండ్సమ్ హీరో ఎలా అయ్యారు ..? నువ్వు నిఖిల్ తో, రామ్ తో.. ఎన్ని సినిమాలు చేశావు.. నితిన్ తో చేశావు ..? మరి ఎందుకు వాళ్ళని హాండ్ సమ్ హీరో అని చెప్పలేదు ..? నీకు ఆఫర్ ఇచ్చిన వాళ్లు నీ కంటికి కనిపించరా అనుపమ ..? అంటూ ప్రశ్నిస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news