Moviesపులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే నా..? సింగర్...

పులిని చూసి నక్క వాత పెట్టుకోవడం అంటే ఇదే నా..? సింగర్ మంగ్లీ పై ఫ్యాన్స్ ఫైర్..!!

ఎస్ ప్రెసెంట్ ఇవే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు నిన్న మొన్నటి వరకు చాలా పద్ధతిగా ట్రెడిషనల్ గా ఉన్న బ్యూటీలు సైతం యంగ్ బ్యూటీస్ చేసే హాట్ ఫోటోషూట్స్ చూసి వాళ్ళు అదే సాంప్రదాయాన్ని ఫాలో అవుతున్నారు. ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రిటీసే కాదు.. సామాన్య జనాలకు కూడా హై క్వాలిటీ ఫోటోషూట్స్ చేయడానికి ఇష్టపడుతున్నారు. మరి ముఖ్యంగా ఒక హీరోయిన్ ట్రెండీ గా కనిపిస్తే చాలు ..ఆ లుక్స్ ను కాపీ చేస్తూ పద్ధతిగా ఉన్న బ్యూటీలు సైతం అంతే హాట్ గా కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

రీసెంట్ గా అదే లిస్టులోకి యాడ్ అయిపోయింది సింగర్ మంగ్లీ . మంగ్లీ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుని ఇప్పుడు ఓవైపు రాజకీయ నేతలు మరోవైపు సినీ స్టార్స్ ఆమె పాటల కోసం వెయిట్ చేసేంతలో క్రేజ్ సంపాదించుకుంది . సింగర్ మంగ్లీ ఎంత మంచి పాటలు పాడుతుందో మనకు తెలిసిందే.

ఆమె పాటలతో మ్యాజిక్ చేస్తుంది . అంతేకాదు ఆమె కట్టుబొట్టు కూడా అలానే ఉంటాయి . అయితే రీసెంట్గా సింగర్ మంగ్లీ సరికొత్త అవతారంలో దర్శనమిచ్చింది . చాలా ట్రెండీగా ఉండే వెస్ట్రన్ వేర్ లో కనిపించింది . ఇప్పటివరకు మంగ్లీని ఇలాంటి లుక్స్ లో మనం చూసిందే లేదు. దీంతో ఒక్కసారిగా మంగ్లీ అభిమానులు షాక్ అయిపోతున్నారు . నువ్వు కూడా అలాంటి లిస్టులోకి జాయిన్ అయిపోయావ ..? అంటుంటే మరికొందరు వద్దు.. నువ్వు పాత మంగ్లీ లానే బాగున్నావ్ ..గెటప్ చేంజ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో మంగ్లీ ఫోటోషూట్ వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news