Moviesఇన్ని సంవత్సరాల తన కెరీర్ లో చిరంజీవి కూడబెట్టిన టోటల్ ఆస్తుల...

ఇన్ని సంవత్సరాల తన కెరీర్ లో చిరంజీవి కూడబెట్టిన టోటల్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా? దట్ ఈజ్ మెగాస్టార్..!!

నేడు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి పుట్టినరోజు . ఈ రోజున మెగా ఫ్యాన్స్ పెద్ద పండగల సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. హైదరాబాద్లో అర్ధరాత్రి నుంచి మెగాస్టార్ ఇంటివద్ద కోలాహలం నెలకొంది. భారీ కటౌట్లతో ..ప్లెక్సీలతో.. పాలాభిషేకాలతో.. పూలదండలతో చిరంజీవికు గ్రాండ్ గా హ్యాపీ బర్త డే విషెస్ అందజేశారు ఫ్రెండ్స్ .

నేడు ఆయన తన 68వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పలువురు స్టార్స్ సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు ఆయనకు చాలా కావాల్సిన సన్నిహితులు విషెస్ అందిస్తున్నారు . కాగా 1955 ఆగస్టు 22న కొణిదెల శివశంకర వరప్రసాద్ జన్మించిన విషయం అందరికీ తెలిసిందే . 1978లో హీరో గా తెలుగు ఆడియోస్ అందుకు వచ్చారు చిరంజీవి . ఇప్పటివరకు 150కి పైగానే సినిమాలు చేసిన చిరంజీవి తన కెరియర్ లో ఎన్నో హిట్లు ఫ్లాప్ లను చవిచూసారు.

కాగా సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి చాలా కాలం అవుతున్న మెగాస్టార్ చిరంజీవి తన కెరియర్లో కోట్లకు పైగానే ఆస్తులు కూడా పెట్టారు . కేవలం సినిమాలోనే కాకుండా పలు బ్రాండెడ్ ఐటమ్స్ ని ప్రమోట్ చేస్తూ అంజనా ప్రొడక్షన్ హౌస్ ద్వారా చిరు ఆస్తులు భారీగానే కూడబెట్టినట్లు తెలుస్తుంది . చిరుకి హైదరాబాద్లో జూబ్లీహిల్స్ లో కోట్ల రూపాయల విలువ చేసే బంగ్లా ఉన్న విషయం మనందరికీ తెలిసిందే .

అందులో సకల సౌకర్యాలు ఉండేలా నిర్మించుకున్నారు చిరంజీవి . దాని ఖరీదు 50 కోట్ల పైగానే ఉంటుంది అంటూ ప్రచారం జరుగుతుంది . అలాగే హైదరాబాదులో పలు ఫామ్ హౌస్ లు.. బెంగళూరులో ఫ్లాట్లు ..హైదరాబాదులోని కోకాపేట్ లో కొన్ని వేల విలువ చేసే స్థలాలు.. లగ్జరీ కార్లు.. ఖరీదైన ఆటోమొబైల్స్ ఎన్నో చిరంజీవికి ఉన్నాయి. ఇవన్ని కలిపి టోటల్ ఆస్తి మొత్తంగా చూసుకున్న సరే చిరంజీవి 2670 కోట్లకు పైగానే ఆస్తి ఉంటుంది అంటూ తెలుస్తుంది. చిరు సంపాదించడంతోపాటు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ తదితర కార్యక్రమాలతో ప్రజాసేవ కూడా చేస్తూ ప్రశంసలు పొందుతున్నారు. దీంతో సోషల్ మీడియాలో చిరంజీవి ఆస్తుల విలువ వైరల్ అవుతున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news