Movies"భోళా శంకర్" ప్రీమియర్ టాక్: మెగా అభిమానులకు బిగ్ రాడ్.. మరో...

“భోళా శంకర్” ప్రీమియర్ టాక్: మెగా అభిమానులకు బిగ్ రాడ్.. మరో ఆచార్య 2 ఇది ..సినిమా అట్టర్ అట్టర్ ఫ్లాప్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి లేటెస్ట్ గా నటించిన సినిమా “భోళా శంకర్”. ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద తుస్సు మనిపించింది. వేదాళం సినిమాకు ఈ సినిమా పూర్తిగా రీమేక్ అన్న విషయం అందరికీ తెలిసిందే . అయితే తెలుగు జనాలకు నచ్చే విధంగా అక్కడక్కడా నాటి డైలాగ్స్.. మసాలాలు దట్టించి ..ఫ్యామిలీ సెంటిమెంట్ ఎమోషన్స్ తో తెరకెక్కించారు.

అయితే ఆయన ఏమి ఊహించుకొని డైరెక్ట్ చేసాడో తెలియదు కానీ థియేటర్ కి వచ్చిన జనాలకి మాత్రం తలనొప్పులే వచ్చేలా ఉన్నాయి అంటూ మెగా ఫాన్స్ మండిపడుతున్నారు .సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా మెగాస్టార్ రేంజ్ కథ కాదు అని విషయం క్లియర్ గా అర్ధమైపోతుంది. ఎక్కడ కూడా చెప్పుకొతగ్గ ఎంటర్టైన్మెంట్ లేదు అని అడపాదడపా కామెడి డైలాగ్స్ వచ్చినా పెద్దగా పేలలేదు అని.. అసలు సెంటిమెంట్ ఎక్కడ పండలేదని చెప్పుకొస్తున్నారు.

అంతేకాదు మెహర్ రమేష్ మెగా ఫ్యామిలీ పరువు తీసేసాడని ఇక సినిమాల ఆపేసి ఇంట్లో కూర్చుంటే బెటర్ అని చెప్పుకొస్తున్నారు. సినిమాలో అంత మంది పెద్ద స్టార్స్ ఉన్నా సరే వాళ్ళని నటనపరంగా ఏ విధంగా వాడుకోలేకపోయారని చెప్పుకొస్తున్నారు . అంతేకాదు నాసిరకమైన డైలాగ్స్ ను.. ఆల్రెడీ ప్రిడెక్టెడ్ సీన్స్ ను ఎక్కువగా పెట్టారు అని చెప్పుకొస్తున్నారు . మొత్తానికి ఏదో ఊహించుకున్న మెగా ఫాన్స్ కి మరి ఏదో రిజల్ట్ వచ్చింది . భోళా శంకర్ అట్టర్ ప్లాప్ టాక్ సొంతం చేసుకుంది . కాగా గాడ్ ఫాదర్ – వాల్తేరు వీరయ్యతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న చిరంజీవికి ఈ సినిమాతో హిట్ అందుకుంటారు అనుకున్నారు . అయితే అది కాస్త దొబ్బేసింది ..ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది .. రిజల్టే ఈ విధంగా ఉంటే మరి కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో అంటూ మెగా ఫాన్స్ బాధపడిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news