News' భోళాశంక‌ర్ ' అనిల్ సుంక‌ర‌కు రు. 40 కోట్లు బొక్క‌......

‘ భోళాశంక‌ర్ ‘ అనిల్ సుంక‌ర‌కు రు. 40 కోట్లు బొక్క‌… ఆ సాయం కూడా చేయ‌న‌ని చెప్పేసిన చిరు..!

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ఛ‌రిష్మా రోజురోజుకు దారుణంగా పడిపోతుంది. అసలు భోళాశంకర్ సినిమా చూసిన జనాలు అయితే చిరంజీవి ఈ వయసులో ఇలాంటి కథతో సినిమాలు తీయడం ఏంటని ?తలలు పట్టుకుంటున్నారు. రోజురోజుకు చిరంజీవి క్రేజ్ తగ్గుతుంది. అయితే చిరంజీవి తన సినిమాల‌కు తీసుకుంటున్న రెమ్యున‌రేషన్ అమాంతం పెరిగిపోతుంది. చిరంజీవి రెమ్యూనరేషన్‌తో పాటు ఆయన సినిమాల బడ్జెట్ పెరుగుతుంది.. మార్కెట్ తగ్గుతుంది.. ఇలాంటి టైం లో పెద్దరికం పాత్రలో కాస్తా రెమ్యున‌రేష‌న్‌ తగ్గించుకోవడం.. తనతో సినిమాలు తీసిన నిర్మాతలు నష్టపోకుండా.. కష్టపడకుండా కాస్త రిలాక్స్ గా సినిమాలు రిలీజ్ అయ్యేలా కూడా చిరంజీవి సాయం చేయటం లేదన్న విమర్శలు తీవ్రంగా వస్తున్నాయి.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాకు తీసుకొన్నారు రెమ్యునరేషన్ 50 కోట్లు. ఇక వాల్తేరు వేరే సినిమాకు 55 కోట్లు ఇచ్చారు. ఆ సినిమా హిట్ అయింది.. లాభాలు వచ్చాయి. వాల్తేరు వీరయ్య తర్వాత భోళా శంకర్ సినిమాకు ఏకంగా 65 కోట్లు తీసుకున్నారు. నిజంగా పది కోట్లు పెంచేయడం అంటే చాలా దారుణమైన విషయం అని ఇండస్ట్రీ వాళ్ళే ముక్కున వేలేసుకుంటున్నారు. అసలు చిరంజీవి భోళా శంకర్ సినిమాను నైజాం ఏరియాకు కొనే బయ్యర్ లేడు. ఒకప్పుడు మెగాస్టార్ తన రెమ్యూనరేషన్ కింద నైజం ఏరియా రైట్స్ తీసుకునేవారు అనే టాక్ ఉండేది.

అలాంటి నైజాం ఏరియాలో చిరంజీవి సినిమాలు ఇప్పుడు కొనే నాథుడే లేకుండా పోయాడు. చివరికి భోళాశంకర్ సినిమాను 20 కోట్ల అడ్వాన్స్ మీద నైజాంలో పంపిణీ చేశారు. పోనీ ఓవర్సీస్ లో శంకర్‌ను కూడా కొనేవాళ్ళు లేకుండా పోయారు. ముందు కొంటాము అన్న బయ్యర్ వెనక్కి పోయాడు. చివరికి అదే వ్య‌క్తికి బతిమలాడి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్‌ ఇచ్చిన పరిస్థితి. ఆంధ్రాలో కేవలం రెండు మూడు ఏరియాలో మాత్రమే అమ్మినా మిగిలిన ఏరియాలో అమ్మ లేకపోయారు. దీనిని బట్టి చిరంజీవి సినిమా మీద ట్రేడ్ వర్గాలకు కూడా ఎలాంటి నమ్మకాలు లేవని తెలుస్తోంది.

అన్నిటికన్నా ఘోరమైన విషయం ఏంటంటే ఈ సినిమా శాటిలైట్ హక్కులు కూడా అమ్ముడు కాలేదు. చిరంజీవి సినిమా శాటిలైట్ హక్కులు అమ్ముడు కాలేదంటే అంతకన్నా దారుణమైన విషయం ఏముంటుంది. చివరకు నిర్మాత అనిల్ సుంకర చిరంజీవికి కూడా రెమ్యున‌రేష‌న్‌ ఇవ్వలేని పరిస్థితి. రెమ్యూనరేషన్ బకాయి కింద శాటిలైట్ హక్కులు ఇచ్చి కొంత కవర్ చేయాలని అనుకున్నారట. అయితే చిరంజీవి మాత్రం అందుకు ససేమేరా అన్నట్టు తెలుస్తోంది. తనకు శాటిలైట్ హక్కులు వద్దని పట్టుబట్టడంతో చివరకు బతిమిలాడి రు. 60 కోట్ల వరకు నగదు చెల్లింపులు చేసి మరో ఐదు కోట్లకు పోస్ట్ డేటెడ్ చెక్కు ఇచ్చినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.

అసలు చిరంజీవి మెగాస్టార్ అయితే ఈ సినిమా పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుంది. ఓవరాల్ గా భోళాశంకర్ సినిమా రిలీజ్ అయ్యే టైం కు నిర్మాత అనిల్ సుంకర కు రు. 40 కోట్ల వరకు డెఫిషెట్ వచ్చినట్టు తెలుస్తోంది. అయినా కూడా ఆయన నానా ఇబ్బందులు పడి సినిమా రిలీజ్ చేశారు. ఓవైపు నిర్మాత అంత కష్టపడుతుంటే చిరంజీవి కనీసం చిన్న సాయం కూడా చేయలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇక్కడ చిరంజీవిని పూర్తిగా తప్పు పట్టలేము. ఆయనకు రు. 65 కోట్లు ఎవరు ఇమ్మ‌న్నారు.. చిరంజీవి రెమ్యునరేషన్ తగ్గ‌నప్పుడు ఎగబడి ముందుకు వెళ్లి సినిమా తీసి ఘోరంగా చేతులు కాల్చుకున్న నిర్మాతల‌దే తప్పు. రేపు భవిష్యత్తులో సినిమా తీసే నిర్మాతలైన చిరంజీవితో సినిమాలు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచిది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news