Movies63 ఏళ్ల ఏజ్‌లో ఇదేం ఎన‌ర్జీరా బాబు… డ్యాన్స్‌లో కుమ్మి ప‌డేసిన...

63 ఏళ్ల ఏజ్‌లో ఇదేం ఎన‌ర్జీరా బాబు… డ్యాన్స్‌లో కుమ్మి ప‌డేసిన బాల‌య్య ( వీడియో )

నందమూరి బాలకృష్ణ 63 ఏళ్ల వయసులోనూ వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకి పోటీగా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే అఖండ – వీర సింహారెడ్డి లాంటి రెండు వరుస సూపర్ డూపర్ హిట్ సినిమాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ఈ దసరాకు భగవంత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. శ్రీలీల బాలయ్య కూతురు పాత్రలో కనిపించబోతుంది.

భగవంత్‌ కేసరి అక్టోబర్ 19న‌ గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల అవుతుంది. ఇదిలా ఉంటే బాలయ్యకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఇందులో బాలయ్య నటి పూర్ణతో కలిసి నందమూరి నాయక పాటకు అదిరిపోయే స్టెప్పులు వేశాడు. 63 ఏళ్ల వయసులోనూ బాలయ్య తగ్గేదెలా అన్నట్టుగా డ్యాన్స్‌ చేశాడు.

అసలు బాలయ్య ఎనర్జీ చూస్తుంటే బాలయ్య వయసు 63 సంవత్సరాలా లేదా 33 సంవత్సరాలా అన్నట్టుగా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భ‌గ‌వంత్ కేస‌రి సినిమా తర్వాత బాలయ్య బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. సూర్యదేవర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ సినిమాలో తమన్నా పేరు హీరోయిన్ గా పరిశీలనలో ఉంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news