Moviesబిగ్ ట్విస్ట్: నిహారిక మళ్లీ ప్రేమ పెళ్లి … నాగబాబు దిమ్మ...

బిగ్ ట్విస్ట్: నిహారిక మళ్లీ ప్రేమ పెళ్లి … నాగబాబు దిమ్మ తిరిగే కండిషన్లు..!

మెగా ఫ్యామిలీలో.. మెగా ఫ్యామిలీ ఆడపడుచుల పెళ్లిళ్లు విడాకులు, వైవాహిక బంధాలు అంత సాఫీగా సాగకపోవడం వారిని బాగా కలవరపాటుకు గురి చేస్తున్నాయి. చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత వైవాహిక బంధం అంతంతమాత్రంగానే నడుస్తోంది. ఇక చిన్న కుమార్తె శ్రీజ ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుని మొదటి భర్తకు విడాకులు ఇవ్వగా రెండో భర్తకు కూడా విడాకులు ఇచ్చే ఆలోచనలోనే ఉంది. ఇక నాగబాబు కుమార్తె నిహారిక, జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకొని ఏడాదిన్నరకే విడాకులు ఇచ్చేసింది.

మెగా ఫ్యామిలీ ఆడబిడ్డలు ఇలా భర్తలకు దూరంగా ఉంటూ మెగా ఫ్యామిలీకి కూడా ప్రజల్లో క్రేజ్ తగ్గుతూ వస్తోంది. ఎవరో ఒకరు తరచూ ఏదో ఒక విమర్శలు చేయడం పరిపాటిగా మారింది. ఇది ఇలా ఉంటే నిహారిక ఇప్పుడు రెండో పెళ్లికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈసారి కూడా ఆమె మళ్లీ ప్రేమ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే నిహారిక సినిమా రంగానికి చెందిన ఒక వ్యక్తితో ప్రేమలో ఉందని త్వరలో అతడితోనే ఆమె రెండో పెళ్లి జరగబోతుందని తెలుస్తోంది.

అయితే ఈసారి నాగబాబు ఆమెకు చాలా పెద్ద కండిషన్ లు పెట్టినట్టు తెలుస్తోంది. నిహారిక ప్రేమించిన వ్యక్తిని ఇప్పటికే తన ఇంటికి పిలిపించి మీ ఇద్దరూ ఎలాంటి గొడవలు అరమరికలు లేకుండా సంసార జీవితాన్ని గడుపుతారా మీ ఇద్దరూ ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నారా.. జీవితంలో వచ్చే ఎలాంటి ఇబ్బందులు అయినా ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారా ఇవన్నీ అడిగిన తర్వాత తనకు సానుకూలంగా ఉందని అనిపిస్తేనే నిహారికకు రెండో పెళ్లి చేసేందుకు నాగబాబు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

వాస్తవానికి నిహారిక మొదటి పెళ్లిలో ఆమె ప్రేమ కంటే కుటుంబ సభ్యులు కుదిరిచిన సంబంధం కావడంతో ఆమె చైతన్యను సరిగా అర్థం చేసుకోలేదన్న అభిప్రాయాలు ఉన్నాయి. అందుకే ఈసారి ఆమె ప్రేమ పెళ్లికి రెడీ అవుతున్నట్టు సమాచారం. నాగబాబు తొలి వివాహంలో జరిగిన తప్పులు దృష్ట్యా రెండోసారి అలాంటి తప్పులకు ఛాన్స్ ఇవ్వకూడదని చాలా కండిషన్లతో నిహారిక రెండో పెళ్ళికి తన అంగీకారం తెలుపుతారని తెలుస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news