Newsహాలీవుడ్ రేంజ్ లో 'గాండీవధారి అర్జున' టీజర్.. గూస్ బంప్స్ తెప్పించే...

హాలీవుడ్ రేంజ్ లో ‘గాండీవధారి అర్జున’ టీజర్.. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీన్స్.. వరుణ్ తేజ్ హిట్ కొట్టేసాడ్రోయ్(వీడియో)..!!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా “గాండీవధారి అర్జున”. ఆగస్ట్ 25వ తేదీన గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కావడానికి సిద్ధమైన ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు మేకర్స్. కాగా మల్టీ టాలెంటెడ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడే సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు .

కాగా ఆ తర్వాత రిలీజ్ అయిన ఒక్కొక్క అప్డేట్ తో సినిమా కి హ్యూజ్ బజ్ క్రియేట్ అయిపోయింది . ఈ చిత్రంలో భారీ యాక్షన్స్ అడ్వెంచర్ చేయబోతున్నాడు వరుణ్ తేజ్ అంటూ మొదట్లోనే చెప్పేశాడు డైరెక్టర్. కాగా రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ అభిమానులను మరింత ఆకట్టుకుంటుంది. ఒక నిమిషం 10 సెకండ్ల నిడివి గల ఈ టీజర్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనాల్సిందే . హాలీవుడ్ చిత్రాన్ని తలపించే రేంజ్ లో హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ..మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కుమ్మేశాడు అంటున్నారు మెగా ఫాన్స్ .

అంతేకాదు ఇది మొత్తం స్పై ధిల్లర్ మూవీలా కనిపిస్తుంది . “ఇది ఎమర్జెన్సీ ఫైల్ 13 మనకి ఎట్టి పరిస్థితులను కావాలి “అనే బ్యాగ్రౌండ్ డైలాగ్స్ తో టీజర్ మొదలవుతుంది.. ఆ తర్వాత ఒక్కొక్క షాట్ లో ప్రవీణ్ సత్తారు తన డైరెక్షన్స్ బాగా చూపించాడు . అంతేకాదు సినిమాలో అన్ని రకాల హంగులు అద్దిన ఆయన హీరోయిన్ సాక్షి వైద్య ని కూడా బాగా యూస్ చేసుకున్నారు . మరి ముఖ్యంగా ఈ సినిమాలో ల యాక్షన్ సీన్స్ హాలీవుడ్ రేంజ్ లో తలపిస్తున్నాయి అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . దీంతో గాండీవధారి అర్జున సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు . మొత్తానికి నిశ్చితార్థం తర్వాత ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకో బోతున్నాడు వరుణ్ తేజ్ అంటూ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news