Moviesఇక్కడ ఒక్కే ప్లేట్ లో అన్నం తింటున్న ..ఈ ఇద్దరు టాప్...

ఇక్కడ ఒక్కే ప్లేట్ లో అన్నం తింటున్న ..ఈ ఇద్దరు టాప్ హీరోలను గుర్తుపట్టారా..!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు . డైరెక్టర్ – హీరోస్ ..హీరో – హీరోయిన్స్ ..విలన్ – హీరోస్ ఇలా బోలెడు మంది ఉన్నారు . అయితే చాలా తక్కువ మంది మాత్రమే ఒకే ప్లేట్ లో అన్నం తినే అంత ఫ్రెండ్షిప్ ఉన్న నటులు ఉన్నారు . వాళ్ళల్లో ఒకరే ఇక్కడ మీరు ఈ ఫోటోలో చూస్తున్న ఇద్దరు హీరోలు . కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రాణ స్నేహితులు ఎవరా అంటే అందరు కళ్ళు మూసుకొని టక్కున చెప్పేది కాంతారా సినిమా డైరెక్టర్ రిషిబ్ శెట్టి.. ఆయన ఫ్రెండ్ రక్షిత్ శెట్టి.

వీళ్ళ స్నేహబంధం ఇప్పటిది కాదు ఎప్పటినుంచో ఒకరినొకరు చాలా చాలా గౌరవించుకుంటారు ..ఇష్టపడతారు.. కాంతర సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న రిషిబ్ శెట్టి ..ఎంత స్టార్ అయిపోయాడో మనకు తెలిసిందే. కాగా రీసెంట్గా చార్లీ 777 సినిమాతో బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టాడు రక్షిత్ శెట్టి . ఇలా కెరియర్ లో దూసుకుపోతున్న ఇద్దరు మంచి ప్రాణ స్నేహితులు .

ఈ క్రమంలోనే జులై 7న రిషబ్ శెట్టి పుట్టినరోజు సందర్భంగా వారిద్దరూ కలిసి ఒకే ప్లేట్ లో భోజనం చేస్తున్న వీడియోను షేర్ చేసుకున్నారు . దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మీ ఫ్రెండ్ షిప్ ఎప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాము అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news