Moviesఎన్టీఆర్ బావమరిది కోసం కత్తిలాంటి ఫిగర్.. కుల్లుకుని చచ్చిపోతున్న తెలుగు హీరోలు..!!

ఎన్టీఆర్ బావమరిది కోసం కత్తిలాంటి ఫిగర్.. కుల్లుకుని చచ్చిపోతున్న తెలుగు హీరోలు..!!

సినిమా ఇండస్ట్రీలో నాన్నల పేర్లు ..తాతలు పేర్లు చెప్పుకొని చాలామంది హీరోలు ఎంట్రీ ఇచ్చారు. ప్రెసెంట్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని సంపాదించుకున్న వాళ్ళందరూ బ్యాక్ గ్రౌండ్ తో ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయినవారే . అయితే అదే స్ట్రాటజీని ఫాలో అవుతూ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నాడు . ఆయన పేరు నితిన్. ఆయన మరెవరో కాదు. ఎన్టీఆర్ కి స్వయాన బావమరిది . లక్ష్మీ ప్రణతి బ్రదర్ నే ఈ నితిన్ . కాగా ఇప్పటికే “శ్రీశ్రీశ్రీ రాజావారు” అనే సినిమాను పూర్తి చేసి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ఈ హీరో.. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే నెక్స్ట్ సినిమాని సైతం సైన్ చేసి ఇండస్ట్రీలో ఉన్న హీరోలకు షాక్ ఇచ్చాడు .

అంతేకాదు నితిన్ సైన్ చేసిన నెక్స్ట్ ప్రాజెక్ట్ పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . భారీ ప్రొడక్షన్ హౌస్ గీత ఆర్ట్స్ వారు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయబోతున్నారట . అల్లు అరవింద్ దృష్టి ఈ కుర్రాడిపై పడడంతో భవిష్యత్తును నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లే బాధ్యత ఈ ప్రొడ్యూసర్ తీసుకున్నారు అంటూ తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఓ టాప్ మోస్ట్ దర్శకుడు సైతం లైన్లో పెట్టారట అల్లు అరవింద్ . అంతేకాదు లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గీతాగోవిందం లాంటి సినిమాతో ఈ హీరో కెరియర్ని మలుపు తిప్పబోతున్నాడు అల్లు అరవింద్ అంటూ తెలుస్తుంది.

ఈ సినిమాలో హీరోయిన్గా యంగ్ బ్యూటీ శ్రీలీలను సెలెక్ట్ చేసుకున్నారట మేకర్స్. అంతేకాదు ఎన్టీఆర్ సైతం ఆమె పేరుని సజెస్ట్ చేయడం గమనార్హం . దీంతో ఈ కుర్రాడు పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . కాగా నితిన్ మొదటి చిత్రం “శ్రీశ్రీశ్రీ రాజావారి” విషయానికి వస్తే శతమానం భవతి సినిమాని డైరెక్ట్ చేసిన స‌తీష్ వేగేశ్న ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు . మాస్ లవ్ స్టోరీ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కోసం ట్రై చేస్తున్నారు ఈ హీరో. అంతేకాదు త్వరలోనే సినిమా ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టబోతున్నాడు నితిన్ అంటూ తెలుస్తుంది. ఏది ఏమైనా సరే ఫస్ట్ సినిమా రిలీజ్ అవ్వకుండానే సెకండ్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్ లో హిట్ కొట్టడానికి ట్రై చేస్తున్న ఈ హీరోని ఎన్టీఆర్ అభిమానులు సైతం ఎంకరేజ్ చేస్తున్నారు . చూడాలి మరి ఎన్టీఆర్ బావమరిది ఎన్టీఆర్ పేరుని ఎలా నిలపెడతాడో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news