Movies"జీవితంలో నేను చేసిన అతి పెద్ద క్షమించరాని తప్పు ఇదే".. స్టేజీ...

“జీవితంలో నేను చేసిన అతి పెద్ద క్షమించరాని తప్పు ఇదే”.. స్టేజీ పైనే రజనీకాంత్ సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే కొన్ని కొన్ని సార్లు తప్పులు చేస్తూ ఉంటారు . అలాంటి తప్పులు చేసి ఆ తప్పులను సరిదిద్దుకున్న వాడే రియల్ హీరో.. ఆలిస్ట్ లోకి వస్తాడు కోలీవుడ్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రజినీకాంత్ . ఈ పేరు చెప్పగానే కోట్లాదిమంది జనాలు ఊగిపోయే రేంజ్ లో ఆయనను అభిమానిస్తూ ఉంటారు జనాలు. ధియేటర్స్ లో ఈయన బొమ్మ పడితే..విజిల్స్ తో దద్దరిల్లిపోతుంది. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ రోబో తర్వాత రజనీకాంత్ కు సరైన హిట్ పడటం లేదు . కొన్ని సంవత్సరాలుగా ఒక్క హిట్ కొట్టడానికి ఎంతో తాపత్రయ పడిపోతున్న రజనీకాంత్ కు జైలర్ సినిమాతో మళ్ళీ ఆ పునర్ వైభవం దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

కోలీవుడ్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన జైలర్ సినిమా ఆగస్టు 10న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా నటించింది . తాజాగా జరిగిన ఈ ఈవెంట్ లో మాట్లాడుతూ తలైవా చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయారు . అంతేకాదు తన లైఫ్ కి సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ సైతం అభిమానులతో షేర్ చేసుకున్నారు .

“నేను ఎంతో పెద్ద స్టార్ హీరోనిఅని అంతా అనుకుంటూ ఉంటారు . కానీ నేను కూడా మీలాగే ఓ సామాన్యుడిని .. నా జీవితంలో ఒక విషయంలో నేను చాలా బాధపడ్డాను. అదే మందు తాగడం . నా జీవితంలో మద్యం అనేది లేకపోయి ఉంటే ..ఈపాటికి నేను ఎప్పుడో సమాజ సేవ చేస్తూ ఉండేవాడిని . మందు తాగడం నాకు ఓ వ్యసనం లా మారిపోయింది . నా జీవితాన్ని సగం వరకు నాశనం చేసింది. నేను చేసిన అతి పెద్ద తప్పు ఇదే . “నువ్వు రాజువి మందు తాగద్దు అంటూ” నా తమ్ముడు నాకు ఎప్పుడు చెప్పుకొచ్చేవాడు. కానీ నేను వినలేదు . ఆ మత్తులో ఆ మైకంలో నా లైఫ్ ని ఆల్కహాల్ కి అంకితం చేసేసాను . ఒకవేళ అది మానేసి ఉంటే ఇప్పుడు నేను ఇంకా ఎంతో గొప్ప స్థాయిలో ఉండేవాడిని” అంటూ చెప్పుకొచ్చాడు . దీంతో రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news