Moviesబ్రేకింగ్ : కాబోయే భర్త ఫోటోని షేర్ చేసిన ఇలియానా.. అభిమానులకి...

బ్రేకింగ్ : కాబోయే భర్త ఫోటోని షేర్ చేసిన ఇలియానా.. అభిమానులకి ఊహించని షాకే ఇది..!!

ఫైనల్లీ ..హీరోయిన్ ఇలియానా తనకు కాబోయే భర్త ఫొటోస్ సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది . కాగ దేవదాసు సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఇలియానా.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటిస్తూ సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని అందుకున్నారు. కాగ మహేష్ బాబు ఇలియానా నటించిన పోకరి సినిమా ఈమెకు మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ లో సైతం అవకాశాలు అందుకుని టోటల్గా టాలీవుడ్ ని మర్చిపోయిన ఇలియానా అక్కడికి వెళ్ళాక హద్దులు మీరి ప్రవర్తించింది నటించింది .

ఈ క్రమంలోనే ఆమెకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఇలాంటి క్రమంలోనే తల్లి కాబోతున్నాను అంటూ సెన్సేషనల్ పోస్ట్ చేసింది ఇలియానా . ఇన్నాళ్లు తనకు కాబోయే భర్తను తన కడుపులో ఎదుగుతున్న బిడ్డకు తండ్రిని ఎవరికి చూపించలేదు. అప్పుడప్పుడు పోస్ట్లు పెట్టిందే కానీ.. ఆ పోస్టులల్లో ఆయన ఫోటో రిలీజ్ చేయలేదు. అయితే రీసెంట్ గా కొద్దిసేపటిక్రితమే కాబోయే భర్తను డేట్ కి తీసుకెళ్లిన ఆమె ఆ పిక్స్ అభిమానులతో షేర్ చేసుకున్నింది.

ఈ క్రమంలోనే ఇతడే ఇలియానాతో పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ వచ్చేలా చేసిన వ్యక్తి అంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ గురి చేస్తున్నారు. మరి కొందరు ఇన్నాళ్లు కత్రినా సోదరుడు సెబాస్టియన్ తో డేటింగ్ చేస్తుంది అంటూ ఆ కడుపులోని బిడ్డకు ఆయనే తండ్రి అంటూ చెప్పుకొచ్చారు . అయితే తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ లో ఆ వ్యక్తి కాకపోవడంతో ఆ ఊహాగానాలకు తెరపడింది . దీంతో ఈ ముద్దుగుమ్మ మరికొద్ది రోజుల్లోనే బిడ్డకు జన్మనివ్వబోతుంది అని అందుకే తన తండ్రిని పరిచయం చేసిందని చెప్పుకొస్తున్నారు. చూడాలి మరి తన బాయ్ ఫ్రెండ్ పేరుని ఆ రోజు ప్రకటిస్తుందో లేదో ఈ బ్యూటీ . ప్రెసెంట్ అతని ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news