Moviesకళ్యాణ్ రామ్ సినిమాని దొబ్బేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన బన్ని.....

కళ్యాణ్ రామ్ సినిమాని దొబ్బేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేసిన బన్ని.. ఆ సినిమా మూవీ ఇదే..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ – చరణ్ పేర్లు ఏ స్థాయిలో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఈ ఇద్దరు కలిసి ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటించి సూపర్ డూపర్ హిట్ అందుకోవడమే కాకుండా కోట్లాదిమంది ఇండియన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఆస్కార్ అవార్డ్ సైతం తీసుకొచ్చారు. దీంతో వీళ్లిద్దరి పేర్లు మారుమ్రోగిపోతున్నాయి. హాలీవుడ్ డైరెక్టర్ లు సైతం తారక్ చరణ్ ల తో సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇదే విషయాన్ని ఓపెన్ గా కూడా చెప్పుకొచ్చారు . కాగా ప్రజెంట్ తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉంటే .. చరణ్ సినిమాలో గేమ్ చేంజర్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఆ తర్వాత బుచ్చిబాబు సనా దర్శకత్వంలో కూడా మరో సినిమాకి కమిట్ అయ్యాడు . కాగ ఇలాంటి క్రమంలోనే రాంచరణ్ – తారక్ కి సంబంధించిన పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా గతంలో ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాను రాంచరణ్ దొబ్బేసి సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు అనే వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే ఎన్టీఆర్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాడు . కధల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు.

అయితే ఎన్టీఆర్ కు బృందావనం లాంటి హిట్ ఇచ్చిన వంశీ పైడిపల్లి మరో సినిమా ఎన్టీఆర్ తో చేయడానికి అద్భుతమైన కథతో ఆయన వద్దకు వెళ్లాడట . అయితే ఆయన ఆ కథ నచ్చిన కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేక రిజెక్ట్ చేశాడట . ఆ సినిమా మరి ఏదో కాదు రాంచరణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ “ఎవడు” సినిమా . ఈ సినిమా కథను ముందుగా ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కు చెప్పగా వారికి కథ నచ్చిన ఎన్టీఆర్ కాల్ షీట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఈ కథ ని రిజెక్ట్ చేశారట .

ఆ తర్వాత ఈ కథను రాంచరణ్ కి వివరించగా రాంచరణ్ ఇంప్రెస్ అయిపోయి స్పాట్లోనే అగ్రిమెంట్ పేపర్ల పై సైన్ చేసాడట . ఆ తర్వాత అల్లు అర్జున్ ని ఈ సినిమాలో చిన్న పాత్ర కోసం చూస్ చేసుకున్నాడు . ఇలా ఎన్టీఆర్ చేయాల్సిన సినిమాను రాంచరణ్ – అల్లు అర్జున్ చేసి బిగ్గెస్ట్ హిట్స్ తమ ఖాతాలో వేసుకున్నారు . అప్పట్లో ఈ సినిమా ఎంత హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . 35 కోట్లతో దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తే దాదాపు 65 కోట్లు ఈ సినిమా వసూలు చేసి ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది . దీంతో ఎన్టీఆర్ తన కెరియర్ లో ఓ మంచి సినిమాని మిస్ చేసుకున్నట్లయ్యింది..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news