Moviesగూస్ బంప్స్ తెప్పిస్తున్న లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరో ఎవరో...

గూస్ బంప్స్ తెప్పిస్తున్న లోకేష్ కనగరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్.. హీరో ఎవరో తెలిస్తే ఊగిపోవాల్సిందే.. మరో బాహుబలి పక్కా..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఏ ఇండస్ట్రీ అయినా సరే లోకేష్ కనకరాజ్ పేరే హై రేంజ్ లో వినిపిస్తుంది . విక్రమ్ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా మారిపోయిన లోకేష్ కనగరాజ్ త్వరలోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది ఒక డైరెక్టర్ హీరో కాల్ షీట్స్ కోసం వెయిట్ చేయట్లేదు ..డైరెక్టర్ కాల్ షీట్స్ కోసమే హీరోలు వెయిట్ చేస్తున్నారు .

ఈ డైరెక్టర్ ఎప్పుడెప్పుడు మనకు దొరుకుతాడా ..? ఆ డైరెక్టర్ తో సినిమా తీద్దామా..? అంటూ బడా హీరోలు కూడా వెయిట్ చేస్తున్నారు ..అంటే లోకేష్ కనకరాజ్ రేంజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు . కాగా రీసెంట్గా లోకేష్ కనగరాజ్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెంచారు అంటూ తెలుస్తుంది . ఆయన దర్శకుడుగా పరిచయం కాకముందు నుంచే ఓ భారీ సోషియో ఫాంటసీ సినిమాను తీయాలని ఆలోచించారట . కానీ కెరియర్ స్టార్టింగ్ లోనే ఆ రేంజ్ సినిమా చేస్తే ఎక్కడ బెడిసి కొడుతుందో అంటూ ఇన్నాళ్లు ఆగారట .

ఇప్పుడు మంచి క్రేజ్ ఫామ్ రావడంతో ఆయన తన డ్రీం ప్రాజెక్టును పట్టాలకించాలని మిషన్ తో వర్క్ చేస్తున్నారట. అయితే దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చాడు. లోకేష్ ఇరుముకై మాయావి అనే పేరుతో చాలా ఏళ్ల కిందటే ఓ ఫాంటసీ కధను సిద్ధం చేశారట . ఆల్రెడీ విక్రంలో సూర్యునికి చూపించిన లోకేష్ అతని తన డ్రీం ప్రాజెక్టుకి హీరో అని కూడా క్లారిటీ ఇచ్చేశాడు .

సూర్యతో చేయబోయే తన రెగ్యులర్ స్టైల్ కు భిన్నంగా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నాడట లోకేష్ కనగరాజ్ . ఒకవేళ నిజంగా ఇది సక్సెస్ అయ్యి తెరపై సూర్య అలా కనిపిస్తే.. కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్ అవుతుందని చెప్పాలి .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news