Moviesబిగ్ షాకింగ్: మెగా హీరో సూసైడ్ అటెంప్ట్..ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న...

బిగ్ షాకింగ్: మెగా హీరో సూసైడ్ అటెంప్ట్..ఫ్యాన్స్ ని టెన్షన్ పెడుతున్న న్యూస్..!!

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ఏ విషయమైనా సరే ఇట్టే సెకండ్స్ లో వైరల్ గా మారిపోతుంది. అలాంటి న్యూస్లు విని కొన్నిసార్లు సంబరపడితే .. మరి కొన్నిసార్లు టెన్షన్ పడాల్సిన పరిస్ధితి ఎదురవుతుంది. ప్రజెంట్ గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ కి సంబంధించిన ఓ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . మెగా హీరో సూసైడ్ అటెండ్ చేసుకోబోతున్నాడట . అంతేకాదు సూసైడ్ అటెండ్ చేసుకోబోతున్నాడు అన్న న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో తెగ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . అయితే ఈ వార్త విన్న అభిమానులు తెగ టెన్షన్ పడిపోతున్నారు . కానీ ఇది రియల్ లైఫ్ లో కాదు రీల్ లైఫ్ లో అని తెలుసుకొని కూల్ అవుతున్నారు . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా హీరో సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ లేటెస్ట్ గా నటిచ్చిన చిత్రం “బ్రో -ది అవతార్”.

ఈనెల 28న ఈ సినిమా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. సముద్రఖని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ లుక్ లో కనిపించబోతున్నారని రీసెంట్గా రిలీజ్ అయిన టీజర్ లోనే తెలిసిపోతుంది . అంతేకాదు మెగా అభిమానులు ఎలా అయితే మామ అల్లుడ్ని చూడాలి అనుకున్నారో.. దానికి డబుల్ రేంజ్ లు సముద్రఖనీ తెరపై చూపించాడు అన్న కామెంట్స్ కూడా వినిపించాయి. మొన్న ఈ మధ్యనే విడుదలైన మై డియర్ మార్కండేయ సాంగ్ కి మొదట్లో కాస్త నెగటివ్ టాక్ వచ్చిన తర్వాత పికప్ అయ్యి హ్యూజ్ రేంజ్ లో వ్యూస్ సాధించుకునింది . ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ అభిమానులను తెగ టెన్షన్ పెడుతుంది .

ఈ సినిమా క్లైమాక్స్ లో సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకోబోతున్నాడట. ఇంట్లోని ప్రాబ్లమ్‌స్ ..లవ్ ఫెయిల్యూర్..ఇలా అన్ని బాధలు తట్టుకోలేక సాయి ధరమ్ తేజ్ సూసైడ్ చేసుకోవాలి అని డిసైడ్ అవుతాడట. ఆ టైంలో పవన్ దేవుడిలా కధను మలుపు తిప్పబోతున్నాడు అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమా ద్వారా నేటి యువతకి పవన్ కళ్యాణ్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు అంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ క్లైమాక్స్ సీన్ మొత్తం చాలా హార్ట్ టచింగ్ గా ఉంటుందని .. పవన్ కళ్యాణ్ సైతం సాయిధరమ్ తేజ్ సూసైడ్ చేసుకున్న సన్నివేశం చూసి షూటింగ్స్ లోనే ఏడ్చేసాడు అన్న న్యూస్ కూడా సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . . మొత్తానికి సినిమా ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎమోషన్స్ ద్వారా తెరకెక్కినట్లు ప్రచారం జరుగుతుంది చూడాలి మరి తెరపై ఈనెల 28వ తేదీ ఈ మామా అల్లుళ్ల రచ్చ ఎలా ఉండబోతుందో..? ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది ..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news