Movies"అది ఉంటే సినిమా హిట్".. చిరంజీవి సెంటిమెంట్ భళే విచిత్రంగా ఉందే..?

“అది ఉంటే సినిమా హిట్”.. చిరంజీవి సెంటిమెంట్ భళే విచిత్రంగా ఉందే..?

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోలు సెంటిమెంట్లను ఎక్కువగా ఫాలో అవుతున్నారు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ బడా హీరోలు తమ సెంటిమెంట్లను ఎలా ఫాలో అవుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే అదే లిస్టులోకి యాడ్ అయిపోయాడు మెగాస్టార్ చిరంజీవి . జనరల్ గా మెగాస్టార్ చిరంజీవి ఇలాంటి సెంటిమెంట్లను పెద్దగా ఫాలో అవ్వడు . కధ విన్నామా..? నచ్చిందా..? చేసామా..?.. అంతే ..అదే ఆలోచిస్తారు . అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చిరంజీవి పూర్తి సెంటిమెంటల్ పర్సన్ గా మారిపోయాడు అంటూ చెప్పుకు వస్తున్నారు మెగాస్టార్ ఫ్యాన్స్ .

ఈ క్రమంలోనే ఖైదీ నెంబర్ 150 సినిమా తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమా లో నటించిన చిరంజీవి ఆ తర్వాత నుంచి తన సినిమాలో ఓ యంగ్ హీరోని పెట్టుకోవడం అలవాటుగా మార్చేసుకున్నాడు. బహుశా ఆయన ఏజ్ ఎక్కువగా తెలియకుండా ఉండడానికో.. లేదా..? సినిమాలో యంగ్ ఫీలింగ్ టచ్ ఇవ్వడానికో తెలియదు కానీ ..ఆయన నటించిన సినిమాల్లో యంగ్ హీరోస్ ని పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి . ఆ తర్వాత వాల్తేరు వీరయ్య సినిమాలో రవితేజతో స్క్రీన్ షేర్ చేసుకున్నారు .

ఇప్పుడు భోళా శంకర్ సినిమాలో సుశాంత్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు . ఇలా చూసుకుంటే వాల్తేరు వీరయ్య – గాడ్ ఫాదర్ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఖచ్చితంగా భోళా శంకర్ సినిమా కూడా సినీ ఇండస్ట్రీని తిరగరాసేస్తుంది. అయితే చిరంజీవి ఇదే సెంటిమెంట్ ను రిపీట్ చేసి తన తర్వాతి సినిమాలలో కూడా హీరోస్ ని యంగ్ హీరోస్ ని పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడట . ఇప్పటికే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాకి కమిట్ అయిన చిరంజీవి .. ఆ సినిమాలో యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డను ఫిక్స్ చేసుకున్నారట. అంతేకాకుండా బింబిసార డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో కూడా చిరంజీవి ఓ సినిమాకి కమిట్ అయినట్లు తెలుస్తుంది . అయితే ఈ సినిమాలో ఏకంగా ఇద్దరు యంగ్ హీరోస్ ని చూస్ చేసుకున్నాడట మెగాస్టార్ చిరంజీవి . దీంతో మెగాస్టార్ చిరంజీవి సైతం ఇలాంటి సెంటిమెంట్ లని ఫాలో అవుతాడా..? అంటూ మెగా ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు…!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news