Moviesఅభిమానులకు బిగ్ షాకిచ్చిన విజయ్ దేవరకొండ.. ఈ ట్వీస్ట్ అస్సలు ఊహించలేదు...

అభిమానులకు బిగ్ షాకిచ్చిన విజయ్ దేవరకొండ.. ఈ ట్వీస్ట్ అస్సలు ఊహించలేదు కదారా బాబు..!!

ఎస్ ఇది నిజంగా విజయ్ దేవరకొండ అభిమానులకు బిగ్ షాక్ అనే చెప్పాలి . టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ ప్రజెంట్ శివనిర్వాణ దర్శకత్వంలో “ఖుషి” అనే సినిమాలో నటిస్తున్నాడు . ఈ సినిమా అయిపోగానే గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న సినిమాలో కూడా పాల్గొనబోతున్నాడు . ఖుషి సినిమాలో హీరోయిన్ సమంత ఆయనకు జోడి కడుతూ ఉండగా.. గౌతం తిన్నురి సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుంది .

అయితే రెండు సినిమాల్లోనూ టాప్ హీరోయిన్లనే పెట్టుకొని అభిమానులని ఫుల్ సాటిస్ఫై చేసిన విజయ్ తన నెక్స్ట్ సినిమాకి మాత్రం ఫ్లాప్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకున్నాడు . ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ గా మారింది . టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే కెరియర్ ప్రెసెంట్ ఎలాంటి టఫ్ సిచువేషన్ లో నడుస్తుందా మనకు బాగా తెలిసిందే. అమ్మడుకు అవకాశాలు ఇవ్వడానికి డైరెక్టర్స్ పారిపోతున్నారు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు .

కాగా ఇలాంటి క్రమంలోనే విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలో ఆమెకు ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో విజయ్ మరో సినిమాకి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే . ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు . ఈ క్రమంలోనే దిల్ రాజు ఫేవరెట్ హీరోయిన్ అయినా పూజ హెగ్డేను ఈ సినిమాలో పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట .విజయ్ కూడా దానికి సరే అనడంతో పూజ హెగ్డే ఖాతాలో మరో బంపర్ ఆఫర్ వచ్చి చేరింది. అయితే ఫ్యాన్న్స్ మాత్రం ఈ విషయంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు . ఏంటన్న అంటూ కౌంటర్స్ వేస్తున్నారు . అంతేకాదు గతంలో జనగణమన సినిమాలో హీరోయిన్గా విజయ్ దేవరకొండతో పూజ నటించాల్సి ఉండింది . అయితే ఆ సినిమా ఆగిపోవడంతో ఆ ఆఫర్ ని ఇలా బ్యాలెన్స్ చేస్తున్నాడు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news