Moviesడైరెక్టర్ తేజ - పవన్ కళ్యాణ్ కాంబో లో మిస్ అయిన...

డైరెక్టర్ తేజ – పవన్ కళ్యాణ్ కాంబో లో మిస్ అయిన సినిమా ఇదే.. ఆ స్టార్ హీరో బలి…!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా.. డైరెక్టర్ తేజ కి ఉన్న ప్రత్యేక గుర్తింపు గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు . సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సినిమాలను ఇచ్చిన తేజ ప్రజెంట్ అడ్రస్ గల్లంతయింది. ప్రెసెంట్ తేజ – దగ్గుబాటి వారసుడు అభిరామ్ తో “అహింస” అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు . త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది . ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చురుగ్గా పాల్గొంటున్న తేజ పలు ఇంటర్వ్యూలలో తన పాస్ట్ అండ్ ప్రెసెంట్ లైఫ్ గురించి ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే తేజ మహేష్ బాబు కాంబినేషన్ లో ఆగిపోయిన సినిమా గురించి బయటపడింది . టాలీవుడ్ పవర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ తో తేజ ఎప్పటినుంచో సినిమా తీయాలనుకుంటున్నాడట . కాగా ఆయన కోసం సపరేట్గా స్క్రిప్ట్ రాసి మరి ఆయన ఇంటికి వెళ్లి స్క్రిప్ట్ చదివి వినిపిస్తే ఆ కథ నచ్చలేదు అంటూ ఓపెన్ గా చెప్పేసారట . ఆ కథ మరో హీరో చేసి బిగ్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు .

ఇంతకీ ఆ సినిమా ఏంటో తెలుసా.. “నిజం”. టాలీవుడ్ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కెరియర్ లోనే పరమ చెత్త రికార్డు నెలకొల్పిన ఈ సినిమాని మొదట అనుకున్న హీరో పవన్ కళ్యాణ్ . అయితే ముందుగానే ఈ సినిమా బాగోదు అంటూ గెస్ చేసిన పవన్ కళ్యాణ్ .. ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు. మహేష్ బాబు బుక్ అయిపోయాడు . అలా పవన్ కళ్యాణ్తో చేయాల్సిన డిజాస్టర్ ను మహేష్ తో చేసి కెరీర్ నాశనం చేసుకున్నాడు తేజ అంటూ జనాలు చెప్పుకొస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news