Moviesమళ్ళీ అడ్దంగా బుక్కైన తమన్.. "గుంటురు కారం" మ్యూజిక్ ఆ హిట్...

మళ్ళీ అడ్దంగా బుక్కైన తమన్.. “గుంటురు కారం” మ్యూజిక్ ఆ హిట్ సినిమా నుంచి కాపీ కొట్టాడా..?

టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా నటిస్తున్న సినిమా “గుంటూరు కారం”. నిన్న ఆయన తండ్రి గారు కృష్ణ పుట్టినరోజు సందర్భంగా తన సినిమాకి సంబంధించిన టైటిల్ ని గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. ఈ వీడియో ఓ రేంజ్ లో వైరల్ గా మారింది . మరీ ముఖ్యంగా ఈ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్గా ధమన్ చేయబోతున్నాడు అని తెలిసినప్పటి నుంచి సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ జరిగింది.

ఇలాంటి క్రమంలోనే సోషల్ మీడియాలో మరోసారి “గుంటూరు కారం” గ్లింప్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కాపీ కొట్టాడు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . ఎస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం ఈ సినిమాకి సమంత – నయనతార – విజయ్ సేతుపతిల కాంబోలో వచ్చిన కె.ఆర్.కె సినిమా నుండి కాపీ కొట్టినట్లు క్లియర్గా అర్థం అయిపోతుంది. మ్యూజిక్ బిట్స్ అన్ని మొత్తం ఆ సినిమా నుంచి కాపీ చేశాడు అంటూ ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ధమన్ ని ట్రోలింగ్కి గురి చేస్తున్నారు . ఇక మహేష్ బాబు లుక్స్ విషయానికి వస్తే ఎప్పటిలాగే తన హ్యాండ్ సమ్ అందాలతో అదరగొట్టేసాడు . ఎప్పుడు క్లాస్ లుక్ లో కనిపించే మహేష్ బాబు ఈసారి అభిమానుల కోసం కూసింత ఘాటు గానే కనిపించాడు. దీంతో సినిమా పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ నెలకొన్నాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news