Movies"గుంటూరు కారం" కి మెయిన్ మైనస్ అదే.. ఇంత పెద్ద తప్పు...

“గుంటూరు కారం” కి మెయిన్ మైనస్ అదే.. ఇంత పెద్ద తప్పు త్రివిక్రమ్ ఎలా చేశాడు అబ్బా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్న మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్ అంటే మాత్రం జనాలకు అదో తెలియని స్పెషల్ క్రేజ్ ఉంటుంది . మొదటినుంచి ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలను ఎక్కువగా తెరకెక్కించే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు తో సినిమా చేయాలని స్టార్ హీరోలు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటుంటారు. రీసెంట్గా మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ టైటిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . ఎవరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ సినిమాకి “గుంటూరు కారం” అంటూ ఘాటైన టైటిల్ ఫిక్స్ చేశాడు .

త్రివిక్రమ్ ప్రసెంటేషన్ కూడా చాలా బాగా ఆకట్టుకునింది . మహేష్ బాబుని ఎప్పుడు చూడని విధంగా మాస్ లుక్ లో చూడడం అభిమానులకి కొత్త రకం ఫీలింగ్ ను కలగజేస్తుంది . అయితే మహేష్ బాబు అభిమానులను త్రివిక్రమ్ డిసప్పాయింట్ చేశాడు అన్న న్యూస్ వైరల్ గా మారింది. త్రివిక్రమ్ శ్రీనివాసరావు అనగానే అందరికి టక్కున గుర్తొచ్చేది డైలాగ్ రైటింగ్ . ఆయన సినిమా నుంచి వచ్చే డైలాగ్స్ ఎంత పవర్ఫుల్ గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

ఒక్కొక్క డైలాగ్ మాటల తూటాలు లా పేలుతుంది. మరి అలాంటి త్రివిక్రమ్ ఎందుకు “గుంటూరు కారం” సినిమాలో ఒక పవర్ఫుల్ డైలాగ్ కూడా పెట్టలేదు అన్న న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనం చూసుకున్నట్లయితే “గుంటూరు కారం” సినిమా గ్లింప్స్ మొత్తానికి మొత్తం ఒకే ఒక్క డైలాగ్ రాసుకోచ్చాడు . “ఏందిరా అబ్బాయి అట్టా చూస్తాండవ్ ..బీడి కూడా 3డీ లో కనిపిస్తాందా..?” ఈ డైలాగ్ తప్పిస్తే ఎక్కడా కూడా త్రివిక్రమ్ ఘాటైన డైలాగ్ రాయలేదు . దీంతో మహేష్ బాబు ఫ్యాన్స్ షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news