Moviesపెళ్ళికి ముందే హనీమూన్ ని ఏంజాయ్ చేస్తున్న తమన్నా-విజయ్ వర్మ..అన్ని పనులు...

పెళ్ళికి ముందే హనీమూన్ ని ఏంజాయ్ చేస్తున్న తమన్నా-విజయ్ వర్మ..అన్ని పనులు కానిచేస్తున్నారే(ఫోటోలు)..!!

టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా పాపులారిటీ సంపాదించుకున్న తమన్న పెళ్లికి ముందే హనీమూన్ ని ఎంజాయ్ చేస్తుందా ..? అంటే అవునని అంటుంది బాలీవుడ్ మీడియా. బాలీవుడ్ స్టార్ నటుడు విజయ్ వర్మతో తమన్నా డేటింగ్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఈ మధ్యకాలంలో అతగాడితో ఏకంగా చట్టపట్టాలేసుకొని తిరుగుతూ మీడియాకు కంట పడుతుంది . ఒకప్పుడు మీడియా ఏమనుకుంటుందో..? ఆఫర్లు రావు అంటూ భయపడిన తమన్నా .. ఇప్పుడు హద్దులు మీరేస్తుంది.

పబ్లిక్ గా లిప్ లాక్ ఇచ్చి ఏకంగా తన బాయ్ ఫ్రెండ్ ఇతడే అని అఫీషియల్ గా చెప్పకనే చెప్పేసింది . అంతేకాదు ఈ జంట పెళ్లికి ముందు హనీమూన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . పెళ్లికి ముందే టూర్లు , వెకేషన్లు అంటూ తెగ ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్గా ఈ జంట డిన్నర్ డేట్ కి వెళ్ళింది. దీనికి సంబంధించిన ఫొటోస్ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

ఫుల్ బ్లాక్ డ్రెస్ లో ఇద్దరూ కపుల్స్ లా ఫోటోలు ఇవ్వకపోయినా బ్లాక్ డ్రెస్ లో మాత్రం చాలా హాట్ గా కనిపిస్తున్నారు. కచ్చితంగా ఈ ఇద్దరు ఈడు జోడు బాగుంది అని పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటారు అని చెప్పుకొస్తున్నారు అభిమానులు. ఇన్నాళ్ళు మీడియా కంట కనపడకుండా తిరిగిన తమన్నా.. ఇప్పుడు పబ్లిక్ గానే ఈ రేంజ్ లో రెచ్చిపోతుందంటే..త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుంది అంటూన్నారు జనాలు, చూడాలి మరి తమన్న ఆ గుడ్ న్యూస్ ఎప్పుడు చెబుతుందో..?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news