Moviesశ్రీకాంత్ ఓదెల పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి అంత తోపా.. ఎవరో...

శ్రీకాంత్ ఓదెల పెళ్లి చేసుకున్న ఈ అమ్మాయి అంత తోపా.. ఎవరో తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది ..!!

ఫైనల్లీ .. టాలీవుడ్ స్టార్ట్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న శ్రీకాంత్ ఓదెలా పెళ్లి చేసుకునేసారు. గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఈ డైరెక్టర్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ నానా రచ్చ జరిగిన విషయం తెలిసిందే , అయితే ఎటువంటి అఫీషియల్ ప్రకటన ఇవ్వకుండానే శ్రీకాంత్ ఓదెల సైలెంట్ గా పెళ్లి చేసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. టాలీవుడ్ నాచురల్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరో నాని డైరెక్టర్గా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ ఓదెల దసరా సినిమాతో ఎలాంటి హిట్ తన ఖాతాలో వేసుకున్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

మొదటి సినిమాతోనే అభిమానుల నాడిని పట్టేసి తెరకెక్కించాడు అన్న కామెంట్లు కూడా వినిపించాయి. టాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖులు కూడా శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ ని తెగ మెచ్చుకున్నారు . కాగా ప్రజెంట్ పుష్ప సినిమాకి తనదైన హెల్ప్ చేస్తున్న శ్రీకాంత్ ఓదెల రీసెంట్గా పెళ్లి చేసుకున్నారు . ఆయన పుట్టి పెరిగిన కరీంనగర్ జిల్లాలోని గోదావరిఖనిలో శ్రీకాంత్ ఓదెల ఘనంగా వివాహం చేసుకున్నారు . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా పెళ్లికి హాజరై స్పెషల్ విషెస్ అందజేశారు .

సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల అన్న సంగతి అందరికీ తెలిసిందే . కాగా శ్రీకాంత్ ఈదేల భార్య ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . చూడడానికి చాలా చక్కగా తెలుగింటి ఆడపడుచులా ఉన్న ఈ అమ్మడు చదువుల తల్లి అని తెలుస్తుంది. గోల్డ్ మెడలిస్ట్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అంతేకాదు ఆమె స్వయాన ఆయన మరదలుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . సొంతం మరదల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు శ్రీకాంత్. ఈ దంపతుల ఫోటోలు యమ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news