Moviesనందమూరి ఇంటికి అల్లుడు కావాల్సిన ఆ స్టార్ హీరో.. చివరి నిమిషంలో...

నందమూరి ఇంటికి అల్లుడు కావాల్సిన ఆ స్టార్ హీరో.. చివరి నిమిషంలో బాలయ్య ఎందుకు క్యాన్సిల్ చేశాడు..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం గా పేరు సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎలాంటి పొజిషన్లో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  తండ్రి నందమూరి తారక రామారావు గారి తర్వాత నందమూరి ఫ్యామిలీని సినీ ఇండస్ట్రీలో కంటిన్యూ చేస్తూ అలాంటి ఓ క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు నందమూరి బాలకృష్ణ.  రీసెంట్ గానే వీర సింహారెడ్డి సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్న బాలయ్య ప్రజెంట్ భగవంత్ కేసరి అనే సినిమాలో నటిస్తున్నాడు.

ఆ తర్వాత బాబీ దర్శకత్వంలో మరో సినిమాకి కమిట్ అయ్యారు. కాగా ఇలాంటి క్రమంలోనే బాలయ్యకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ గా మారింది . కాగా బాలయ్య కూతురు బ్రాహ్మిణిని  ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారట బాలకృష్ణ . అదే విషయాన్ని సదరు స్టార్ హీరో తండ్రి కూడా చెప్పుకొచ్చారట.  ఇద్దరు కూడా ఓకే అనుకున్నారట . అయితే ఆ స్టార్ హీరో అప్పటికే వేరే అమ్మాయితో ప్రేమలో ఉండడం ..ఆ ఫోటోలు నెట్టింట లీక్ అవ్వడం అవి కాస్త బాలయ్య కంటపడడంతో నారా బ్రాహ్మీణి కి ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేశారట .

అయితే అప్పటివరకు ఆ స్టార్ హీరో తండ్రికి తన కొడుకు ప్రేమలో ఉన్నాడు అన్న విషయం తెలియక బాలయ్యకు మాటిచ్చేసాడట.  అయినా సరే బాలయ్య పెద్ద మనసుతో ఎవరిదైనా ఇష్టం లేకుండా పిల్లలకి పెళ్లి చేయకూడదు అంటూ ఈ సంబంధాన్ని క్యాన్సిల్ చేసేసారట.  ఆ తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ తో ఘనంగా వివాహం జరిపించారు.  ప్రజెంట్ నారా బ్రాహ్మిణి  హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్తుంది . హెరిటేజ్ సంస్ధలను చూసుకుంటూ తన పుట్టింటికి మెట్టినింటికి మంచి పేరుని సంపాదించపెడుతుంది..!! 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news