Movies"నేను చనిపోయాక అదే చేయ్యండి".. కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ వీడియో..!!

“నేను చనిపోయాక అదే చేయ్యండి”.. కన్నీళ్లు పెట్టిస్తున్న రాకేష్ మాస్టర్ వీడియో..!!

టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించుకున్న రాకేష్ మాస్టర్ నిన్న సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచిన సంగతి మనందరికీ తెలిసిందే . కాగ సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి హెల్ప్ లేకుండా వచ్చి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకున్న రాకేష్ మాస్టర్..ఎంతోమంది కొరియోగ్రాఫర్ లకి లైఫ్ ఇచ్చారు . ఇప్పుడు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్లుగా రాజ్యమేలేస్తున్న శేఖర్ మాస్టర్.. జానీ మాస్టర్ ..ఆయన శిష్యులు అన్న సంగతి మనకు తెలిసిన విషయమే.

కాగ ఇండస్ట్రీలో ఎన్నో హైట్స్ చూసిన శేఖర్ – రాకేష్ మాస్టర్ .. ఆ తర్వాత ఎన్నో డౌన్స్ కూడా చూశారు . ఈ క్రమంలోనే ఆయన నా అనుకున్న వాళ్లు ఒక్కొక్కరిగా చనిపోతూ వస్తూ ఉండడం తో సినిమాలపై కాన్సన్ట్రేషన్ తగ్గించేశారు. అంతేకాదు ఆర్థిక ఇబ్బందులు కారణంగా అప్పులు చేసి సతమతమయ్యారు . కాగ ఇదే క్రమంలో గతంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ .. తన లైఫ్ కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను విషాదకర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.

ఇదే క్రమంలో తనకు ఎంతో ఇష్టమైన తమ్ముడు చనిపోయినప్పుడు ఎంతో బాధపడ్డానని.. ఆ తర్వాత అమ్మ ..ఆ తర్వాత అక్క కొడుకు.. చివరికి నాన్న ఇలా అందరూ చనిపోవడంతో జీవితం పై విరక్తి కలిగిందన్నారు. అంతే కాదు చావంటే తనకు భయం లేదని ..కానీ ఫోన్ కాల్ వస్తే ఎప్పుడు ఏ వార్త వినాలని భయమేస్తుందని ఎమోషనల్ అయ్యారు. కాగా తాను చనిపోతే తన భార్య తండ్రి (మామ) సమాధి పక్కనే వేపచెట్టు నాటానని ..అక్కడే తనకి దహన సంస్కారాలు చేయాలని కోరారు. తాను చనిపోయాక చెట్టు కింద తనని సమాధి చేయాలని చెప్పుకొచ్చాడు. ప్రజెంట్ ఆయన మాట్లాడిన మాటల వీడియో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే రాకేష్ మాస్టర్ లైఫ్ లో ఇన్ని బాధలు పడ్డారా ..? అన్న విషయాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి . కాగ వడదెబ్బ కారణంగా మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ కారణంగా ఆదివారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news