Moviesగ్రాండ్ గా ప్రశాంత్ నీల్ బర్తడే సెలబ్రేషన్స్..ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ కి...

గ్రాండ్ గా ప్రశాంత్ నీల్ బర్తడే సెలబ్రేషన్స్..ప్రభాస్ ఇచ్చిన గిఫ్ట్ కి డైరెక్టర్ ఎమోషనల్..సెట్స్ లోనే ఏడ్చేశాడు..!!

నేడు పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు. ఈ క్రమంలోని సోషల్ మీడియాలో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఫ్యాన్స్ ..సినీ సెలబ్రిటీస్ . సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ 4 జూన్ 1980లో కర్ణాటకలోని నీలకంఠాపురంలో జన్మించారు . తన ఊరి పేరే తన పేరుతో చేర్చారు . నిజానికి ప్రశాంత్ నీల్ పూర్తి పేరు ప్రశాంత్ నీలకంఠాపురం .

కాగా ప్రశాంత్ తెలుగు ఫ్యామిలీకి చెందిన వాడే. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. కానీ బెంగళూరులో సెటిల్ అయ్యారు, ఆయన తల్లి పేరు భారతి – తండ్రి పేరు సుభాష్. కాగా సినిమాలపై ఉండే ప్యాషన్ తో ఇటువైపుగా అడుగులు వేసిన ప్రశాంత్ ..2010లో లిఖిత అనే అమ్మాయితో వివాహం జరిగింది. వీరికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నాడు . అప్పుడప్పుడు పిల్లలతో టైం స్పెండ్ చేసి కొన్ని ఫొటోస్ ను షేర్ చేస్తూ ఉంటాడు ప్రశాంత్ నీల్.

ప్రజెంట్ పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న “సల్లార్” సినిమా షూట్ లో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ బర్తడేఅ వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేశాడు హీరో ప్రభాస్ . సర్ప్రైజింగ్ గా షూటింగ్ సెట్స్ లో కేక్ కట్ చేస్తూ ప్రశాంత్ నీల్ కి అదిరిపోయే మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ను ప్రజెంట్ చేశారు . ప్రశాంత్ నీల్ కి మొదటి నుంచి అమ్మ సెంటిమెంట్ అంటే చాలా ఇష్టం . వాళ్ళ అమ్మగారు అంటే ఎంతో ఇష్టమట . ఈ క్రమంలోనే కొడుకు అమ్మ ఉన్న ఎమోషనల్ హార్ట్ టచ్చింగ్ బొమ్మను ప్రజెంట్ చేశారట. ఇది చూసిన ప్రశాంత్ నీల్ చాలా ఎమోషనల్ అయ్యారట. ప్రజెంట్ సోషల్ మీడియాలో ప్రశాంత్ నీల్ బర్త్ డే కేక్ కటింగ్ ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news