Newsఘాటుగా ప్రేమించుకున్న నయనతార-ప్రభుదేవా ఆ ఇద్ద‌రి వ‌ల్లే విడిపోయారా... !

ఘాటుగా ప్రేమించుకున్న నయనతార-ప్రభుదేవా ఆ ఇద్ద‌రి వ‌ల్లే విడిపోయారా… !

భారత సినిమా పరిశ్రమలో కొన్ని అఫైర్లు ఎప్పటికీ హాట్ టాపిక్‌గానే నిలుస్తుంటాయి. వాటిలో నయనతార ప్రభుదేవా అఫైర్ ఒకటి అని చెప్పవచ్చు. నిజానికి వీరిద్దరూ ఎంతో ఘాటుగా ప్రేమించుకున్నారు. ఎంతగా అంటే ప్రభుదేవా తన భార్యా పిల్లలను వదిలేసి నయనతారని పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యేంతగా. వీరిద్దరూ మూడున్నర ఏళ్లపాటు ఎంతగానో ప్రేమించుకున్నారు.

2009లో పెళ్లి చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని పర్సనల్ కారణాలవల్ల వీరిద్దరూ తాము పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉండలేమని తెలుసుకున్నారు. ఆపై ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నారు. నయనతార ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మేము పెళ్లి చేసుకోకూడదని రాసి పెట్టి ఉంది. మా ఇద్దరి మధ్య ఎందుకు వర్క్ అవుట్ కాలేదో నేను చెప్పలేను” అని చెప్పింది.

అయితే వీరి మధ్య పర్సనల్ ఇష్యూస్‌ ఉన్నాయని చెప్పారు కానీ అవేంటనేది ఎవరికీ తెలియ రాలేదు. కాగా ఈ నేపథ్యంలోనే వీరు విడిపోవడానికి ఒక కారణం ఉందంటూ ప్రచారం మొదలైంది. అదేంటంటే నయనతారని పెళ్లి చేసుకునేటప్పుడు ప్రభుదేవా ఒక కండిషన్ పెట్టాడట. తన భార్య రమాలత్‌కి పుట్టిన ఇద్దరు కొడుకులను తనతో పాటే ఉంచుకుంటానని అన్నాడట.

అంతేకాదు నయనతారతో సహజీవనం చేసేటప్పుడు కూడా తన కొడుకులను తన దగ్గరికి తెచ్చుకున్నాడట. అయితే నయనతార వారిద్దరిని తన తల్లి వద్దే వదిలేయాలని, తమ మధ్యలో వారు అవసరం లేదని ఎప్పుడూ వాదించేదట. అయితే తన కొడుకులను వదులుకోలేక ప్రభుదేవా చివరికి నయనతార నుంచి విడిపోవాలని నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ విధంగా మొదటి భార్య కొడుకులే నయనతార, ప్రభుదేవా పెళ్లి చేసుకోపోవడానికి కారణం అని తెలుస్తోంది.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news