Movies"ఇండస్ట్రీలో నెం 1 హీరో ఆయనే".. సైలెంట్ గా చిచ్చు పెట్టిన...

“ఇండస్ట్రీలో నెం 1 హీరో ఆయనే”.. సైలెంట్ గా చిచ్చు పెట్టిన కోట శ్రీనివాస్ రావు..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో బోలెడు మంది హీరోలు ఉన్నారు. కొత్త కొత్త హీరోలు పుట్టుకొస్తున్నారు . తాత పేర్లు తండ్రి పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చే హీరోలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నారు. అయినా సరే ఇండస్ట్రీలో మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఫ్యాన్స్ ఎప్పుడు కొట్టుకు చస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో నానా విధాలుగా ట్రోల్ అవుతూనే ఉంటారు . అయితే ఎంతమంది హీరోలు ఉన్న టాలీవుడ్ యంగ్ టైగర్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ కు ఉన్న క్రేజ్ వేరు అని చెప్పాలి .

కేవలం సినిమా అభిమానులు .. జనాలే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ కూడా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరో తారకే అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు . అదే విషయాన్ని కన్ఫామ్ చేశాడు మల్టీ టాలెంటెడ్ నటుడు కోటా శ్రీనివాసరావు గారు. రీసెంట్గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూల కోటా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ..టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై సంచలన కామెంట్స్ చేశారు.

“నేటి కాలంలో నేటి జనరేషన్లో ఈ ఇండస్ట్రీకి అవసరమైన హీరోలో ఉండాల్సిన క్వాలిటీస్ అన్ని కూడా ఎన్టీఆర్ లో ఉన్నాయని ..తాతకు తగ్గ మనవడువని ..భవిష్యత్తులో సినీ ఇండస్ట్రీని టాప్ పొజిషన్ కి తీసుకెళ్లలేదు తారక్ అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు , అంతేకాదు ఈ జనరేషన్ హీరోలలో పెద్దగా ఆయనకి ఎవరు నచ్చరని ,, తారక్ – మహేష్ బాబు – బన్నీ అంటే చాలా ఇష్టమని వాళల్లో నటించే స్కిల్స్ బాగుంటాయని ” చెప్పుకొచ్చారు. దీంతో సోషల్ మీడియాలో కోటా శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి . మిగతా హీరోల ఫ్యాన్స్ మా హీరోలు కూడా నెంబర్ వన్ అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news