Moviesఇండస్ట్రీలో మరో పెళ్లి భాజ..పెళ్లి పీటలు ఎక్కబోతున్న కంగనా.. మీడియాకి వెడ్డింగ్...

ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజ..పెళ్లి పీటలు ఎక్కబోతున్న కంగనా.. మీడియాకి వెడ్డింగ్ కార్డు..పోస్ట్ వైరల్!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఫైర్ బ్రాండ్ గా పాపులారిటి సంపాదించుకున్న కంగనా పెళ్లి చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు – సినీ విశ్లేషకులు . బాలీవుడ్ ఇండస్ట్రీలోని ఫైర్ బ్రాండ్ గా పాపులారిటీ సంపాదించుకున్న కంగనా నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అంతే కాదు తాజాగా కంగనా తన ఇంస్టాగ్రామ్ లో ఆమె చేసిన ఒక వీడియో పోస్ట్ చేసింది.

అది నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది . ఆ వీడియోలో కంగనా కారులో వస్తూ ఉంటే ఓ మీడియా ప్రతినిధి ఆమె కారును చుట్టుముట్టి ప్రశ్నించడం మొదలుపెడతారు. దీంతో ఓ విలేఖరి “కగనా మీరు పెళ్లి చేసుకోబోతున్నారా..?” అంటూ క్వశ్చన్ చేస్తాడు . దీనికి గంగన్న స్మైలీగా బదిలీస్తూ అవును ..నిజమే అంటూ మీడియాకి వెడ్డింగ్ కార్డు చూపిస్తుంది . అయితే ఆ కార్డులో కంగనా పేరు లేకుండా ‘టిక్కు వెడ్స్ షేరు’ అని ఉంది.

అప్పటికి కానీ అర్థం కాలేదు అందరికీ ఇది కంగనా ఒరిజినల్ పెళ్లి కాదు సినిమా ప్రమోషన్స్ కోసం చేస్తున్న హంగామా అని. టిక్కు వెడ్స్ షేరు సినిమాని నిర్మిస్తుంది కంగనా. ఆ సినిమాలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, అవనీత్ కౌర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సాయి కబీర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ప్రమోషన్స్ కోసమే కంగనా ఇలా చేసింది అంటూ మండిపడుతున్నారు జనాలు..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news